Breaking : కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచిన ఈడీ అధికారులు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లిన ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు. By srinivas 16 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Delhi : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ను లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) లో అరెస్ట్ చేసి ఢిల్లీ(Delhi) తీసుకెళ్లిన ఈడీ(ED) అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు. మనిలాండరింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూలో ఆమెను జడ్జి ఎమ్ కే నాగ్ పాల్ ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేశారు. Kavitha presented in the Court. #LiquorScam https://t.co/EDh6QYno3e — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (𝐌𝐨𝐝𝐢 𝐤𝐚 𝐏𝐚𝐫𝐢𝐯𝐚𝐫) (@Sagar4BJP) March 16, 2024 కస్టడీలోకి కవిత.. శనివారం ఉదయం రెండుసార్లు వైద్య పరీక్షలు(Medical Tests) నిర్వహించిన అనంతరం ఆమెను కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. అయితే కోర్టులో హాజరయ్యే ముందు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కవిత వాపోయారు. చట్ట విరుద్ధంగా చేసిన అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తనది ఇల్లీగల్ అరెస్ట్ అని, రెండు రోజుల్లో బయటకు వస్తానని అన్నారు. ఇక ఈడీ అధికారులు కవితను 10 రోజుల కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. Also Read : కవిత అరెస్ట్… విజయశాంతి సంచలన వ్యాఖ్యలు #delhi #ed #delhi-liquor-scam-case #brs-mlc-kalvakuntla-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి