Palvai Gate : పాల్వాయి గేటు పోలింగ్ సిబ్బందిపై వేటు.. అందరినీ సస్పెండ్ చేసిన ఈసీ! ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగులగొట్టిన ఘటనపై సీరియస్ గా ఉన్న ఈసీ ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బందిపై వేటు వేసింది. పీఓ సహా అందరినీ సస్పెండ్ చేసింది. By Nikhil 22 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Macherla : మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు (Palvai Gate) పోలింగ్ స్టేషన్ పీఓ సహా ఇతర సిబ్బందిని ఈసీ (EC) సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ స్టేషన్ (Polling Station) లో జరిగిన సంఘటన దృష్ట్యా పోలింగ్ సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. ఘటన సమయం లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బూత్ లో అడుగు పెట్టిన సమయంలో అక్కడ ఉన్న పీఓ, ఇతర సిబ్బంది లేచి నిలబడి అభివాదం చేశారు. ఈవీఎం (EVM) పగల కొడుతున్న సమయంలో వ్యతిరేకించలేదు. ఈ అభియోగాలపై వారిని ఈసీ సస్పెండ్ చేసింది. రేపటి లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటన పై పీఓ సరైన సమాధానం ఇవ్వలేదని ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read : ఏసీపీ ఉమామహేశ్వర్‌రావుకు జూన్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ #pinnelli-ramakrishna-reddy #macherla #election-commission #palvai-gate #polling-station మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి