Macherla : జైలు నుంచి పిన్నెల్లి విడుదల
మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేయడంతో ఈరోజు ఆయన నెల్లూరు జైలు నుంచి బయటకు వచ్చారు.
Pinnelli Ramakrishna Reddy : మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ తప్పదా?
AP: ఈరోజు హైకోర్టులో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో రెండు కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది.
Pinnelli : పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడ?.. కొనసాగుతున్న పోలీసుల వేట..!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తమిళనాడులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలింగ్ నాడు ఈవీఎం ధ్వంసం, సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నాడు.
Macherla MLA : మరోసారి కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి.. ఎందుకంటే!
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు.హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి తనకు కౌంటింగ్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
Macherla: మాచర్లలో హైటెన్షన్.. మాజీ మంత్రులు హౌస్ అరెస్ట్
AP: మాచర్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల గృహనిర్బంధం చేశారు పోలీసులు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను సైతం హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
Palvai Gate : పాల్వాయి గేటు పోలింగ్ సిబ్బందిపై వేటు.. అందరినీ సస్పెండ్ చేసిన ఈసీ!
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగులగొట్టిన ఘటనపై సీరియస్ గా ఉన్న ఈసీ ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బందిపై వేటు వేసింది. పీఓ సహా అందరినీ సస్పెండ్ చేసింది.
Macherla EVM Issue : బూత్ లో ఏం జరిగిందంటే.. టీడీపీ ఏజెంట్ శేషగిరి సంచలన విషయాలు!
మాచర్లలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొడుతుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరి ఆర్టీవీతో మాట్లాడారు. ఈవీఎం పగలగొట్టకముందు ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి రెండు సార్లు వచ్చి వెళ్లాడన్నారు. బయటకు వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు తనపై తీవ్రంగా దాడి చేసినట్లు చెప్పారు.
Macherla MLA : ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్.. సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న పోలీసులు?
ఈవీఎంలను పగలగొట్టిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయన గన్ మెన్, డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు పిన్నెల్లి సోదరులు కూడా పోలీసులకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-29T073921.393.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pineli.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Macherla.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/evm.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/sheshagiri-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-rama-krishnareddy.jpg)