Bhadrachalam : రాములోరి కల్యాణం మీద ఆంక్షలు.. ప్రత్యక్ష ప్రసారం వద్దు

దేశమంతా ఎన్నికల హడావుడి మొదలయింది. నోటిపికేషన్ పడిన దగ్గర నుంచి కోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఎఫెక్ట్ రాములోరి కల్యాణం మీద కూడా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా భద్రాచలం రాములవారి కల్యానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీలు లేదని ఈసీ ఆంక్షలు విధించింది.

New Update
Bhadrachalam : రాములోరి కల్యాణం మీద ఆంక్షలు.. ప్రత్యక్ష ప్రసారం వద్దు

Sri Rama Kalyanam : దక్షిణ భారతదేశం(South India) లో ప్రముఖ రామాలయం భద్రాచలం(Ramalayam Bhadrachalam). తెలంగాణ(Telangana) లో ఉన్న భద్రాచలం రాములవారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వనవాసం సమయంలో రాములవారు సీతా, లక్ష్మణ సమేతంగా ఇక్కడ రెండున్నరేళ్ళు ఉన్నారని చెబుతారు. అధారాలు కూడా చూపిస్తారు. అది కాక భద్రాచలం గుడి వెనుక కూడా పెద్ద చరిత్రే ఉంది. రామదాసు కథ, గుడి కట్టడానికి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. పాటలుగా పాడుకుంటారు. అందుకే ఈ గుడి చాలా ఫేమస్ అయింది. దాంతో పాటూ భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణం కూడా అంతే ప్రసిద్ధిగాంచింది. ఇది చూడ్డానికి లక్షల్లో జనాలు భద్రాచలానికి వస్తారు. దాంతో పాటూ ప్రతక్ష ప్రసారం(Live Telecast) ద్వారా కూడా చాలా మంది వీక్షించి తరిస్తారు.

ఈసీ ఆంక్షలు..

అయితే ఇప్పుడు రాములోరి కల్యాణానికి అడ్డుకట్టపడింది. కల్యాణం యధావిధిగా జరుగుతుంది. కానీ దాని ప్రత్యక్ష ప్రసారం మీద చూడలేము. దేశంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండడం వల్ల భద్రాచలం రాములవారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) లేఖ రాశారు. రాములోరి కల్యాణానికి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది భక్తులు ఆ అద్భుతఘట్టం కోసం ఎదురుచూస్తారని...ఏడాదికి ఒకసారి వచ్చే ఇలాంటి దాన్ని ఆపడం సరైనది కాదని ఆమె కోరారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కళ్యాణ క్రతువుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా దూరం ఉండనున్నారు. దీంతో ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, సీఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు మిథిల స్టేడియంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. 18న మహా పట్టాభిషేకానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణ హాజరయ్యే అవకాశం ఉంది.

Also Read:Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

LSG vs GT: గుజరాత్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా పడిపోయిన వికెట్లు- 15 ఓవర్లకు ఎంత స్కోరంటే?

లక్నో vs గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో గిల్, సుదర్శన్ చెరో హాఫ్ సెంచరీ చేశారు. కానీ వరుస వికెట్లు కోల్పోవడంతో స్కోర్ తగ్గిపోయింది. 15ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్‌లో రూథర్‌ఫోర్డ్, బట్లర్ ఉన్నారు.

New Update
LSG vs GT

LSG vs GT

ఐపీఎల్ 2025 మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు జట్లు టైటిల్ కోసం పోటా పోటీగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ మరో మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే టాస్‌ నెగ్గిన లక్నో జట్టు.. మొదట బౌలింగ్ ఎంచుకుంది.

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

10 ఓవర్లలో 0 వికెట్లు

దీంతో సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ క్రీజులోకి వచ్చారు. మొదటి నుంచి ఓ వైపు దూకుడుగా.. మరోవైపు వికెట్లు నష్టపోకుండా పరుగులు రాబట్టారు. కొట్టాల్సిన దగ్గర పెద్ద పెద్ద షాట్లు కొట్టారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీ చేశారు. ఇలా 10 ఓవర్లలో గుజరాత్ జట్టు ఒక్క వికెట్ పడకుండా 101 పరుగులు చేసింది. దీంతో 100 పరుగులు ఇచ్చినా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు తలలుపట్టుకున్నారు. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

రెండు హాఫ్ సెంచరీలు

అదే సమయంలో ఓపెనర్ గిల్‌(60)ను ఔట్ చేశారు. ఎట్టకేలకు ఓపెనర్ల భాగస్వామ్యానికి (73 బంతుల్లో 120 పరుగులు) లక్నో జట్టు తెరదించింది. ఇక ఆ తర్వాతే సాయి సుదర్శన్ కూడా పెవిలియన్‌కు చేరాడు. భారీ షాట్ ఆడే క్రమంలో సాయి సుదర్శన్‌ (56) క్యాచ్ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ వేసిన 13.1 ఓవర్లో నికోలస్‌ పూరన్‌కు క్యాచ్‌ ఇచ్చి సుదర్శన్‌ వెనుదిరిగాడు. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన వాషింగ్టన్‌ సుందర్‌ (2) సైతం వెను వెంటనే చేతులెత్తేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తడబడ్డాడు. దీంతో గుజరాత్ జట్టు 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో రూథర్ ఫోర్డ్ (1*), బట్లర్ (9*) పరుగులతో ఉన్నారు. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

( LSG vs GT | latest-telugu-news | IPL 2025)

Advertisment
Advertisment
Advertisment