Health Benefits : వామ్మో.. వాము వల్ల ఇన్ని ప్రయోజనాలా? వాము అంటే అందరికి తెలుసే ఉంటుంది. వాము కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్న మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లు, జీర్ణక్రియ, అజీర్తి, గ్యాస్, కిడ్నీల్లో రాళ్లు వంటి సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 04 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Lovage Seeds Health Benefits: వంటింట్లో ఎక్కువగా వాడే చిరుధాన్యాల్లో వాము ఒకటి. వాము వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలున్నాయి. పురాతన కాలం నుంచి భారతీయులు (Indians) వంటకాల్లో వామును ఉపయోగిస్తూ ఉంటారు. ఇంటి పరిసరాల్లో కూడా వాము మొక్కను పెంచుకుంటూ ఉంటారు. వాము మొక్క చక్కని వాసనతో పాటు అద్భుత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కకు తెల్లటి పూలు ఉంటాయి వాటి నుంచే మనకు వాము లభిస్తుంది. వాము కేవలం వంటల్లో రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఆయుర్వేదంలో వాముతో చాలా రకాల మందులను తయారు చేస్తారు. ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో వాము బాగా ఉపయోగపడుతుంది. వాము నుంచి నూనె కూడా తీస్తారు. దీన్న మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రోటీన్లు అందుతాయి. ఇది కూడా చదవండి: బీర్ తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందా? ఆహారం జీర్ణం కానప్పుడు వామును వేడి నీళ్లలో వేసి నమిలి తినడం వల్ల ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. జీర్ణక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. వామును వేడి నీటిలో కలిపి తాగడం వల్ల దగ్గు కూడా తొందరగా తగ్గిపోతుంది. రాత్రిపూట పొడి దగ్గు వచ్చినప్పుడు వామును తమలపాకుతో కలిపి తింటే వెంటనే ఆ దగ్గు తగ్గిపోతుంది. వామును వేడి నీటిలో కలిపి నమిలి పుక్కిలించడం వల్ల పిప్పళ్ల నొప్పి కూడా తగ్గుతుంది. వాము, మిరియాలు, ఉప్పు సమపాల్లో తీసుకొని ఒక పౌడర్‌గా చేసి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు భోజనం చేసే ముందు ఈ పౌడర్‌ను పావు టీ స్పూన్ తీసుకుంటే అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉండవు. జ్వరంతో ఉన్నవారు వాము, జీలకర్ర, ధనియాలను కలిపి తింటే జ్వరం తగ్గుతుంది. బాలింతల్లో కూడా వాము వాడడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. వాముతో కషాయం చేసుకుంటే కిడ్నీల్లో రాళ్లు పోతాయి. తేనెతో వామును కలిపి తీసుకోవడం వల్ల రాళ్లు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గిపోతాయి జలుబు, తలనొప్పి ఉన్నవారు వామును దంచి చిన్న బట్టలో మూట కట్టి వాసన చూస్తూ ఉంటే జలుబు తగ్గిపోతుంది. పిల్లలకు జలుబు చేసినప్పుడు వాము మూటను దిండు కింద ఉంచడం వల్ల జలుబు, ముక్కుదిబ్బడ నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. వాము ఎక్కువగా వాడితే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఊపిరితితుల్లో కఫం తొలగిపోతుంది. వాముపొడిని మజ్జిగలో కలుపుకొని తాగితే ఊపిరితిత్తులు శుభ్రంగా తయారవుతాయి. ఆస్తమా కూడా తగ్గిపోతుంది. బెల్లంతో వామును కలుపి తింటే ఆస్తమా ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది. వాము రసాన్ని మింగడం వల్ల కొండ నాలుకకు వచ్చిన వాపు కూడా తగ్గుతుంది. వామును నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే నల్ల మచ్చలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. వాము పేస్ట్‌ని గాయాలపై రాస్తే తొందరగా మానుతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. వాము కషాయం తాగడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గిపోతాయి. వాము నీటిని వాడడం వల్ల మగవారికి లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. #health-tips #health-benefits #indians #vamu #lovage-seeds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి