భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్‌లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. By srinivas 16 Nov 2023 in Uncategorized New Update షేర్ చేయండి జమ్మూ కశ్మీర్‌లో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇంట్లోనుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.9గా నమోదైనట్లు తెలిపిన అధికారులు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. Also read :అక్కడ సెల్ఫీ దిగుతున్నారా.. అయితే మీ ఓటు రద్దే ఇదిలావుంటే.. ఉత్తరఖండ్‌లోని ఉత్తరకాశీలోనూ గురువారం తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించినట్లు చెప్పారు. దీని తీవ్రత 3.1గా నమోదయిందని, భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం రాజధాని డెహ్రూడూన్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అర్ధరాత్రివేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయకు వచ్చినట్లు చెప్పారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ రాలేదని అధికారులు వెల్లడించారు. #earthquake #jammu-kashmir #uttarakhand మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి