Dubai Princess: భర్తకు విడాకులిచ్చిన దుబాయ్‌ యువరాణి..

దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌.. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దంపతులకు మొదటి సంతానం కలిగిన రెండు నెలల్లోనే విడాకుల ప్రకటన రావడం గమనార్హం.

New Update
Dubai Princess: భర్తకు విడాకులిచ్చిన దుబాయ్‌ యువరాణి..

దుబాయ్ యువరాణి షైకా మహ్రా మొహమ్మద్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌.. తన భర్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ దంపతులకు మొదటి సంతానం కలిగిన తర్వాత కేవలం రెండు నెలల్లోనే విడాకుల ప్రకటన రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇన్‌స్టాలో షేకా మహ్రా ఇలా రాసుకొచ్చారు. ' ప్రియమైన భర్తకు.. మీరు ఇతరుల సహచర్యం కోరుకోవడం వల్ల మీకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఐ డైవర్స్ యూ. టేక్‌ కేర్‌.. మీ మాజీ భార్య అంటూ' పేర్కొన్నారు.

Also Read:  రామసేతును రాముడే కట్టడా ? సహజంగా ఏర్పడిందా ?

ఇదే సమయంలో ఈ దంపతులిద్దరూ కూడా ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. కలిసి దిగిన ఫొటోలు డిలీట్ చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ల విడాకుల ప్రకటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం షైకా మహ్రా ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని చెబుతున్నారు. మరికొందరు ఇది సాహసోపేతమైన నిర్ణయమంటూ ప్రశంసిస్తున్నారు.

Also read: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistan PM: యుద్ధానికి సిద్ధం సైన్యానికి సెలవులు రద్దు.. పాకిస్థాన్ కీలక ప్రకటన

భారత్ సిందూ ఒప్పందం రద్దు చేయడమంటే యుద్ధం ప్రకటించడమే అంటూ పాక్ పేర్కొంది. పాక్ ప్రధాన మంత్రి గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పాక్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే.. తిప్పికొట్టాలని ఆర్మీని ఆదేశించింది.

New Update
pak meeting

పాక్, భారత్ మధ్య ఉత్రిక్తత పరిస్థితిను నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ పాక్‌తో దౌత్య సంబంధాలు తెచ్చుకుంది. పాకిస్థాన్ హై కమిషన్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని 72 గంటల టైం ఇచ్చింది. అలాగే సిందూ నదీ జలాల ఒప్పందం కూడా రద్దు చేసింది. దీంతో గురువారం పాకిస్థాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత వైఖరిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ సైన్యానికి సెలవులు రద్దు చేసింది.

భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్గామ్ దాడిలో భారత్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పాక్ ప్రధాని రిలీస్ చేసిన ప్రెస్ మీట్ లో అన్నాడు. భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన అన్నారు. పాకిస్థాన్ భద్రతా అధికారులు, ఆర్మీ ఆఫీసర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయాలన్న భారత ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరించింది. ఈ ఒప్పందం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఏకపక్షంగా నిలిపివేయడానికి ఇందులో ఎటువంటి నిబంధన లేదని పాక్ ప్రధాని చెప్పారు.

సిందూ నదీ జలాలు ఆపడం అంటే యుద్ధం ప్రకటించడమే అని పాక్ అభిప్రాయ పడుతుంది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు విమానాలను కూడా పాకిస్తాన్ రద్దు చేసింది. పాకిస్తాన్, దాని సార్వభౌమాధికారానికి ఏదైనా భంగం వాటిల్లితే వెంటనే ప్రతిచర్యలు ఉంటాయని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ అన్నాడు.

( attack in Pahalgam | india pakistan news | india-pakistan | war | terrorist | jammu-and-kashmir | pakistan | latest telugu news | today news in telugu)

 

Advertisment
Advertisment
Advertisment