Drinking Water: ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.. ఎందుకంటే?

ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. దోసకాయ, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో యాసిడ్ ఏర్పడుతుంది.

New Update
Drinking Water: ఇవి తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకండి.. ఎందుకంటే?

Drinking Water: సాధారణంగా మనం ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతూ ఉంటాం. కానీ అలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కడుపులోని ఆహారం మొత్తం కుళ్లిపోవడం జరుగుతుందని, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

పచ్చి కూరగాయలు:

  • దోసకాయ, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి మీరు వాటిని తిన్న వెంటనే నీరు తాగితే కడుపులో యాసిడ్ ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

పండ్లు:

  • పుచ్చకాయ, నారింజ వంటి పండ్లు తిన్న వెంటనే నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటిలో అప్పటికే అధిక మొత్తంలో నీరు ఉంటుందంటున్నారు.

టీ, కాఫీ:

  • టీ లేదా కాఫీ తాగిన వెంటనే నీరుతాగడం వల్ల ఎసిడిటీ వస్తుంది. టీ లేదా కాఫీ తాగిన 15-30 నిమిషాల తర్వాత మాత్రమే నీటిని తాగాలని చెబుతున్నారు.

అన్నం, రోటీ:

  • అన్నం లేదా రోటీ తిన్న వెంటనే నీరుతాగడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కడుపులో అసౌకర్యం కలిగిస్తుంది. జీర్ణక్రియ బాగుండాలంటే తిన్న తర్వాత అరగంట వరకు నీళ్లు తాగొద్దని వైద్యులు చెబుతున్నారు.

స్వీట్లు:

  • స్వీట్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల వాటిని జీర్ణం చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ వేగంగా తగ్గిపోతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపు తప్పుతుందని నిపుణులు అంటున్నారు.

అరటిపండు:

  • అరటిపండును నీటితో కలిపి తినడం వల్ల కడుపులో అజీర్ణానికి కారణం అవుతుంది. అందుకే అరటిపండు తినేప్పుడు నీళ్లు తాగొద్దని నిపుణులు అంటున్నారు.

పెరుగు:

  • పెరుగు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలచబడి జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. పెరుగు తిన్న వెంటనే నీరు తాగకూడదు. అరగంట లేదా గంట తర్వాత నీటిని తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : బంగాళాదుంపలను తినడం తగ్గించండి..నెల రోజుల్లో మిమ్మల్ని మీరే నమ్మలేరు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు