Rose Petals Infusion Benefits : ఈ కషాయం తాగితే అనేక అనారోగ్య సమస్యలు పరార్ గులాబీ రేకులు డ్రింక్‌ను తాగితే మంచిది. ఇది తాగడం వల్ల అలసట, నీరసం, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడం, స్పృహ కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు, నిద్రలేమి వంటి రకరకాల సమస్యలు దూరం అవుతాయి. By Vijaya Nimma 09 Dec 2023 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Health Benefits : ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎన్నో సమస్యలు అందర్నీ వేధిస్తూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..? మంచి ఆహారం తీసుకున్నా..? గాని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రక్తహీనత అనేది అందర్నీ వేధిస్తుంది. శరీరంలో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వలన ఈ సమస్య ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత కారణంగా శరీర అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి అలసట, నీరసం, తల తిరగడం, బలహీనత, శ్వాస తీసుకోవడం వంటి ఇబ్బందులు తరచుగా వస్తాయి. అంతేకాకుండా స్పృహ కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు వంటి రకరకాల సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రక్తహీనత సమస్య ఎదుర్కోవటానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్యను దూరం చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి నా చిట్కా ఏమిటో దానివల్ల ఉపయోగాలు అంటూ ఇప్పుడు తెలుసుకుందాం. గులాబీ రేకులతో కషాయం తయారీ.. ఈ డ్రింక్‌ను గులాబీ రేకులు(Rose Petals Infusion) ఎండినవే లేకపోతే తాజావైన వాడుకోవచ్చు. ఈ డ్రింక్‌ను తయారు చేసుకోవడం చాలా సులభంగానే ఉంటుంది. ముందుగా ఓ పాత్ర తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి అందులో ఎర్ర గులాబీ రేకులు, సొంటిపొడి వేసి మరిగించాలి. ఆ నీటిని 10 నుంచి 15 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అవి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి వాటిని తాగాలి. ఇలా రోజూ ఉదయం తాగటం వల్ల శరీరానికి తగినంత ఐరన్ వచ్చి ఆరోగ్యంగా ఉంటాము. తర్వాత రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడతారు. అలాగే ఈ గులాబీ కషాయంను రాత్రి తాగితే నిద్రలేమి సమస్యలు దూరం చేయవచ్చు అంటున్నారు వైద్యులు. హాయిగా నిద్రపోయే అవకాశం ఉంది. అయితే..15 రోజులు కచ్చితంగా ఈ చిట్కాను పాటిస్తే మన శరీరంలో మార్పులు వస్తాయి. ఇంకా ఎన్నో సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: రేగి పండ్లతో ఎన్నో ప్రయోజనాలు..అవేంటో తెలుసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-problems #rose-petals-infusion మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి