Health Tips: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

చాలామందికి పొద్దున్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ టీని ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే అనేక రోగాలకు ఆహ్వానం పలికినట్లే అని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వేడి వేడి టీ తాగేస్తుంటారు. కనీసం గ్లాస్‌ నీరు కడుపులో వేయకుండా టీ తాగేస్తారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు టీ అస్సలు తాగకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Health Tips: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!

ప్రతి మనిషి ఉదయాన్నే కప్పు టీ తాగకుండా ఉండలేడు. అంతేకాదు వారి రోజును ప్రారంభించడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే ఈ అలవాటు శరీరానికి ఎంత మేలు చేస్తుంది..? బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా టీ అస్సలు తాగొద్దా..? డైటీషియన్ మాక్ సింగ్ అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు. మిల్క్ టీ తాగటం అంత మంచిది కాదంటున్నారు. టీలో కొవ్వు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి. అయితే.. టీలో పాలు కలపడం వల్ల కొవ్వు తగ్గే ప్రక్రియ నిరోధిస్తుంది. కాగా పాల టీలో చక్కెర కలుపుకుని చాలామంది తాగుతారు.. కానీ.. అధిక చక్కెర బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. చక్కెర మిల్క్ టీని రోజుకు చాలాసార్లు తాగడం వల్ల కేలరీలను పెంచుతోంది. ఈ టీతో స్నాక్స్ లేకుండా చాలా మంది ఉండలేరు. ఇలా టీతో వేయించిన లేదా ఇతర అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటే బరువు పెరగడానికి దారితీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే టీలో పాలు కలపడం వల్ల టీలోని పోషకాలు శరీరంలోకి చేరకుండా నిరోధిస్తుంది. ఫలితంగా, పాలు లేకుండా టీ తాగడం మంచిదంటున్నారు.

ఎసిడిక్ సమస్యలు

టీని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎసిడిక్ సమస్యలు వస్తాయి. నిజానికి..టీలో థియోఫిలిన్ అనే సమ్మేళనం నిర్జలీకరణానికి కారణం. ఉదయం టీ తాగిన తర్వాత.. నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది. ఇది నోటిలో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఈ పాల టీ తాగిన తర్వాత కడుపు ఉబ్బరం అనిపించవచ్చు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ తాగడానికి ఉత్తమ సమయం భోజనం తర్వాత 1-2 గంటలు మంచిదంటున్నారు. కానీ దీనిని ఖాళీ కడుపుతో ఎప్పుడూ త్రాగకూడదు అంటున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాదు 8 నుంచి 9 గంటల నిద్ర తర్వాత దీనిని తీసుకుంటే, శరీరంలో ఆహారం, నీరు పూర్తిగా ఉండవు అని చెబుతున్నారు.

డీ హైడ్రేషన్‌ వస్తుంది

చాలామందికి ఉదయాన్నే టీ తాగితే రిఫ్రెష్‌గా ఉంటుంది అనుకుంటారు. కానీ దీని వల్ల లాభాల కంటే అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. పొద్దున్నే పరిగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, ‍గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చి.. ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి బెడ్‌ కాఫీ, టీలు తాగుతారు. ఇలా పళ్లు తోముకోకుండా పొద్దున్నే చేయడం వల్ల నోట్లోని చెడు బాక్టీరియా పేగుల్లోకి వెళ్లి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పంటి ఎనామిల్‌ దెబ్బ తిని..పళ్లు దెబ్బతినే అవకాశముంది. టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కెఫీన్‌ మోతాదు పెరిగి మానసిక ఆందోళన, ఒత్తిడి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా టీ తాగడం వల్ల నీళ్లు తాగాలనిపించదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు