Iron Vessel: ఇనుప పాత్రలో వండితే హిమోగ్లోబిన్ పెరుగుతుందా..?

ఇనుప కుండలలో ఆహారాన్ని వండడం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడుతుంటే ఇనుప పాత్రల్లో వండిన ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే రక్తహీనత వంటి వ్యాధి వస్తుంది.

New Update
Iron Vessel: ఇనుప పాత్రలో వండితే హిమోగ్లోబిన్ పెరుగుతుందా..?

Iron Vessel: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న పదార్థాలు తీసుకోవాలి. పోషకాహార నిపుణులు ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సిఫార్సు చేస్తారు. అలాగే పోషకాహారాన్ని అందించడంలో, ఐరన్‌ లోపాన్ని తగ్గించడంలో వంట పాత్రలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కొందరు నమ్ముతారు. ఇనుప పాత్రలో ఆహారాన్ని వండటం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుందని అంటుంటారు. అయితే ఇది నిజంగా శరీరానికి ఐరన్‌ని అందజేస్తుందా అనే దానిపై వైద్యులు పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.

publive-image

ఇనుప పాత్రలో వంట చేస్తే ప్రయోజనాలు:

NCBI నివేదిక ప్రకారం.. ఇనుప కుండలలో ఆహారాన్ని వండడం వల్ల ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తహీనతతో బాధపడుతుంటే ఇనుప పాత్రల్లో వండిన ఆహారాన్ని తినాలని చెబుతున్నారు. నివేదిక ప్రకారం ఇనుప కుండలలో ఆహారాన్ని వండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఇతర తీవ్రమైన వ్యాధుల ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. ఎందుకంటే మనం ఐరన్ పాత్రలో ఆహారాన్ని వండినప్పుడు, గాలిలోని ఇనుము, ఆక్సిజన్ ప్రతిస్పందించి ఐరన్ ఆక్సైడ్‌గా ఏర్పడతాయి. ఇది పదార్థంతో కలిసిపోతుంది. రక్తహీనత సమస్యను అధిగమించాలంటే ఇనుప పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తినాలని వైద్యులు అంటున్నారు.

publive-image

ఒకటే పాత్రలు పదేపదే వాడొద్దు:

మనం నిత్యం ఇనుప పాత్రలో ఆహారాన్ని వండుకుని తింటుంటే దాని దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇనుప పాత్రలో వండిన ఆహారాన్ని ఎక్కువ సేపు తినడం వల్ల ఐరన్ కంటెంట్ ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఆరోగ్యానికి ప్రయోజనంతో పాటు హాని కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఉంటే రక్తహీనత వంటి వ్యాధి వస్తుంది. కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినాలని, జీవనశైలిపై కూడా శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెల్ల మిరియాలు ఎప్పుడైనా తిన్నారా?..ఎన్నో లాభాలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు