Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఆగస్ట్ 1కి వాయిదా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. దీని మీద హైకోర్టులో విచారణ జరిగింది.

New Update
Telangana: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఆగస్ట్ 1కి వాయిదా

Disqualification petition of MLAs : కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావుపై అనర్హత పిటిషన్ వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్ వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వెంటనే అనర్హత వేటు వేయాలని.. ఆ మేరకు స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫున గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను గండ్ర ప్రస్తావించారు. కోర్టు విచారణను ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసింది. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొంది.. కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. దాంతో ముగ్గురు ఎమ్మెల్యేలపై అర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు.

Also Read: T20 Series: ఇది కదా మ్యాచ్ అంటే..సపర్ ఓవర్‌లో టీమ్ ఇండియా విజయం

Advertisment
Advertisment
తాజా కథనాలు