RGV: ఆర్జీవీకి చంద్రబాబు అంటే ఎందుకు నచ్చదో తెలుసా ?.. కారణం ఇదే

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు నచ్చదో ఓ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు. వైస్రాయ్ హోటల్ ఘటన జరిగినప్పటి నుంచి బాబు అంటే తనకు నచ్చదని తెలిపారు.

New Update
RGV : అదే 23న.. చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన ట్వీట్

RGV about Chandrababu:  ప్రముఖ సినీ దర్శకుడు రామ్ వర్మ (Ram Gopal Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ట్విట్టర్‌లో చురుకుగా ఉండే ఆర్జీవీ తనకు ఏది అనిపిస్తే దాన్ని పోస్ట్ చేసేస్తుంటారు. అయితే ఈ మధ్య ఏపీ రాజకీయాలపై ఆయన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని (Chandrababu Naidu) టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు.. ఏపీ రాజకీయాలపై గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసిన ఆర్జీవి.. ఇప్పుడు రానున్న ఎన్నికల సందర్భంగా.. వ్యూహం, శపథం అనే సినిమాలను తీస్తున్నారు. ఇప్పటికే వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమైనప్పటికీ సెన్సార్ బృందం సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే చాలామందికి చంద్రబాబు అంటే ఆర్జీవీకి ఎందుకు పగ అని సందేహం ఉంటుంది. అయితే దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Also Read: పురంధేశ్వరి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టింది.. విజయసాయి రెడ్డి ట్వీట్!

వైస్రాయ్ హోటల్‌ ఘటన జరిగినప్పటి నుంచి చంద్రబాబు అంటే తనకు పగ ఉందని.. చంద్రబాబు ఎన్టీఆర్‌ను (NTR) వెన్నుపోటు పొడిచి టీడీపీని, అధికారాన్ని లాక్కున్నారని.. అందుకే అప్పటినుంచి చంద్రబాబు అంటే తనకు నచ్చదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. తాను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై తీసిన వ్యూహం సినిమాలో ప్రజలకు తెలియని ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబుకు సంబంధించిన బండారం అంతా కూడా ఆ సినిమాలో కనిపిస్తుందని అందుకే ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆర్జీవీ అన్నారు. ఏం చేసినా కూడా వ్యూహం సినిమా (Vyooham Movie) విడుదల అయి తీరుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఏపీ సీఎం జగన్‌కు మద్దతునిస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ చేసే పోస్టులు, చంద్రబాబును ఆయన టార్గెట్ చేసే విధానం హాట్‌ టాపిక్‌గా మారిపోతుంది. మరోవైపు తెలంగాణ రాజకీయ నాయకుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటే చాలా ఇష్టమని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు