Vasantha Krishna Prasad: నా వెనుక గోతులు తవ్వి..నా ప్రత్యర్థులతో చేతులు కలిపారు! నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. By Bhavana 05 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vasantha Krishna Prasad: ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న కొద్ది రాజకీయ వేడి పెరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం(Mylavaram) నియోజక వర్గం అయితే ఏ సమయానికి ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదు. ప్రస్తుతం వైసీపీ (YCP) ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వసంత కృష్ణ ప్రసాద్ గత కొంతకాలంగా పార్టీ పెద్దల మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన ప్రత్యక్షంగానే పార్టీ కార్యకలాపాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పార్టీకి వసంత కొంతకాలంగా దూరంగా ఉంటూనే వస్తున్నారు. దీంతో ఆయన వైసీపీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. వసంత కేవలం వసంత నాగేశ్వరరావు కుమారుడిగానే కాకుండా వ్యక్తి పరంగానూ మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. మైలవరం అంటే టీడీపీ (TDP) కి కంచుకోట వంటిది. అలాంటిది మైలవరంలోనే టీడీపీ సీనియర్ నేత, మంత్రి అయినటువంటి దేవినేని ఉమా (Devineni Uma) మీద భారీ మెజార్టీ తో వసంత గెలిచి చూపించారు. ఈ క్రమంలోనే ఉమాకు వసంత రాజకీయంగా పెద్ద సవాలుగా మారారు అనే చెప్పవచ్చు. ఒకానొక సమయంలో మంత్రిగా వసంత పేరు కూడా వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల జగన్ (CM Jagan) మంత్రి పదవిని ఆయనకు ఇవ్వలేదు. అయినప్పటికీ వసంత ఎక్కడా కూడా నోరు విప్పలేదు. వైసీపీని ఇంటింటికి తీసుకుని వెళ్లడంలో వసంతది (Vasantha Krishna Prasad) కీలక పాత్ర అని చెప్పవచ్చు. వసంత అందరివాడు అని పిలిపించుకోవడంలో విజయం సాధించారు. అయితే ఆయన గత కొంతకాలంగా వైసీపీ నాయకత్వం పై ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడిస్తున్నారు. '' నా రాజకీయ భవిష్యత్తు నా చేతిలో లేదు. కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీ మారుతున్నారని కన్ఫామ్ చేశాయి. ఈ క్రమంలోనే మరోసారి వసంత సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ''నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా వైసీపీ కోసం పని చేశాను. పెడన వెళ్లిన ఓ నాయకుడు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు. ఈ విషయం గురించి అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చినా కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా నేను ప్రజల కోస పని చేశాను. నా వెనుక గోతులు తవ్వుతూ..నా ప్రత్యర్థి ఉమాతో చేతులు కలిపారు. లక్ష లారీల మట్టి కొత్తూరు, తాడేపల్లి నుంచి తరలించారు. వాటికి నన్ను బాధ్యుడిని చేసి వార్తలు రాశారు. ఇసుక విధానం కరెక్ట్ కాదని చెబితే... నేను చూస్తా అని జగన్ చెప్పారు. ఇసుక విధానం వల్ల లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఇసుక పాలసీలో తప్పంతా జగన్ దే... ఎమ్మెల్యే లకు సంబంధం లేదు. మద్యం పాలసీలో కూడా అనేక లోటు పాట్లు ఉన్నాయి. రాజధాని మార్పు ను వ్యతిరేకించినా... నా మీద మాటల దాడి చేయించారు..పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మెరక చేయిస్తే బిల్లులు రాలేదు. మాట తప్పాం, మడమ తిప్పాం... అనేది నిజం. ప్రజలు కూడా పథకాల కన్నా అభివృద్ధి కోరుకున్నారు. గడపగడపకూ వెళితే... మమ్మలను ప్రజలు నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి వల్లే మేము ఎమ్మెల్యే గా గెలిచాం. అలా అని ప్రజల ముందు మమ్మలని దోషులుగా నిలబెట్టారు. వైసీపీ నాయకులు కాంట్రాక్టు పనులు చేస్తే వారికి బిల్లులు ఇవ్వలేదు. అభివృద్ధి, సంక్షేమం పట్ల సమతుల్యత సాధించ లేదు. వై నాట్ 175 అనే నినాదమే పెద్ద తప్పు. అత్యధిక స్థానాలు రావాలని కోరుకోవాలే గానీ... ప్రత్యర్ధి పార్టీ కి స్థానం లేదనుకుంటే ఎలా? . వైయస్సార్ కూడా ఎప్పుడూ ఇంత ఘోరంగా ఆలోచన చేయలేదు. Also read: రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచిలర్ పార్టీలో మెరిసిన మంచు లక్ష్మీ! ఎమ్మెల్యే గా సీఎం ను కలవాలంటే నాకు పెద్ద గగనమే. ఈ ఐదేళ్లల్లో సీఎం ను నేరుగా నాలుగు సార్లు మాత్రమే కలిసే అవకాశం ఇచ్చారు. పార్థసారథి వంటి సీనియర్ లకు మంత్రి పదవి ఇవ్వలేదు. అర్హత లేని వ్యక్తులకు మంత్రి ఇచ్చి, జిల్లా ను వారి చేతిలో పెట్టారు. అభివృద్ధి పనులకు విపక్ష ఎంపీలే నిధులు ఇచ్చారు. స్పిన్నింగ్ పరిశ్రమ కు ఇన్సెంటీవ్ లు కూడా రాలేదు. ఈ విషయం సీఎం దృష్టి కి తీసుకెళ్లినా... నిధులు రాలేదు. వైయస్ పాలనకి, జగన్ పాలనకు కనీస పోలికే లేదు. మద్దాల గిరి, జోగి రమేష్, నాకు మాత్రమే ఇన్సెంటీలు ఇస్తామన్నారు... అదీ జరగలేదు. నా మనసు విరిగిపోయింది... అందుకే వైసీపీ వీడాను. సోషల్ మీడియా లో నా పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేనున్న పార్టీ వై నాట్ 175 అంటుంది. రేపు ఏ పార్టీ అధికారంలోకి అయినా రావచ్చు. ఈ పార్టీ కి మాత్రం దూరంగా ఉంటాను. ఎవరు వైసీపీ వ్యతిరేకించినా వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారు. షర్మిలమ్మ నే వదలకుండా బూతులు తిడుతున్నారు. రేపు నా మీద చాలా గ్రాఫిక్స్, వండి వార్చుతారు. నా వ్యక్తిత్వ హననం చేస్తారు... అయినా బెదరను..ఇప్పటికీ రాజీనామా చేయలేదు. పార్టీ కి దూరంగా ఉన్నాను. త్వరలోనే నేను ఎటు వెళతాను, రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానన్ను కాంగ్రెస్, బిజేపీ, టీడీపీ, జనసేన నుంచి రావాలని అడిగారు. ఎందులో చేరేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే చెబుతాను. దేవినేని ఉమ నా పై చేసిన విమర్శలకు కాలమే సమాధానం చెబుతుంది. కొత్తూరు తాడేపల్లి లో తవ్వకాలు కు అజయ్ అనే వ్యక్తి కి ఎవరు అండగా ఉన్నారు. విటిపియస్ ఫ్లయాష్ అక్రమ రవాణా పైనా విచారణ చేయాలని కోరుతున్నా. ప్రతిపక్ష పార్టీలు నా పై వేలు పెట్టి చూపుతున్నారు. కానీ ఈ రవాణా చేసే డ్రైవర్ లకు అంతా తెలుసు. రాజమండ్రి వాళ్లు ఇక్కడ మిషన్ లు ఎలా పెట్టారు. కొత్తూరు, తాడేపల్లి లో లక్షల లారీల మట్టి వెళ్లింది. స్థానిక ఎమ్మెల్యే గా నేను ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. తహశీల్దారు లు కూడా వారు చెప్పినట్లే పని చేశారు. వీటి పై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా...'' అంటూ వసంత అన్నారు. #ycp #tdp #ap #janasena #politics #mylavaram #vasantha-krishnaprasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి