Batti Vikramarka: 'మరీ ఇంతలా దిగజారుతారా'.. కేసీఆర్‌పై భట్టి ఫైర్

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్‌లోకి చేరుతుంటే కేసీఆర్‌ తట్టుకోలేకపోతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనలో ఆయన చెప్పిన మాటలన్ని అవాస్తవాలని.. పదేళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతారా అంటూ మండిపడ్డారు.

New Update
Bhatti Vikramarka: బీజేపీ నేతలు చెబితేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు.. భట్టి సంచలన ఆరోపణలు!

సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పంట పొలాలు పరిశీలించిన అనంతరం.. మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్‌లోకి చేరుతుంటే కేసీఆర్‌ తట్టుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన చెప్పిన మాటల్లో వాస్తవాలు లేవని అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. రాష్ట్రంలో పది సంవతర్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతారా అంటూ మండిపడ్డారు.

Also Read: ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా!

కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సమస్య వస్తే.. కరెంట్ కోతలు అంటూ అబద్ధాలు చెప్పారని అన్నారు. ' బొగ్గు లభ్యమయ్యే ప్రాంతానికి 350 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టారు. దూరంగా ఉండటం వల్ల థర్మర్‌ ప్లాంటుకు బొగ్గు సరఫరా చేసేందుకు ఖర్చు బాగా అవుతోంది. పర్యవరణ అనుమతులు వచ్చేందుకు ఆలస్యం జరగింది. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.

విభజన చట్టంలో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఇవ్వాలని ఉంది. విభజన చట్టం ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరు అయ్యింది. వాస్తవానికి సూపర్ క్రిటికల్ సాంకేతికతో భద్రాద్రి ప్లాంట్‌ను నిర్మించాల్సి ఉంది. కానీ కమీషన్ల కోసం సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతోనే భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టారని' భట్టి విక్రమార్క అన్నారు.

Also Read: జైల్లోనే… కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

Advertisment
Advertisment
తాజా కథనాలు