Telangana: అలా చేసినందుకే అప్పులు చేయక తప్పడం లేదు: భట్టి విక్రమార్క రాష్ట్రంపై మొత్తంగా రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయడం తప్పడం లేదని పేర్కొన్నారు. By B Aravind 15 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల కోసం బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో ఆయన స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంపై మొత్తంగా రూ.7.11 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయడం తపడం లేదని పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం(FRBM) పరిధి మేరకు రుణాలు తీసుకొని ముందుకెళ్తామని వెల్లడించారు. Also Read: నిరుద్యోగులకు అలర్ట్..జనగాంలో జాబ్ మేళా రాష్ట్రంలో అప్పు ఎంతంటే ' బడ్జెట్‌లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు కేటాయించాం. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు నిర్మిస్తాం. రైతు భరోసా కోసం రూ.15,075 కోట్లు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కోసం రూ.2,418 కోట్లు కేటాయించాం. రూ.500లకు గ్యాస్ సిలిండర్ల కోసం రూ.723 కోట్లు, సాంఘీక సంక్షేమం కోసం రూ.5,185 కోట్లు కేటాయించాం. గిరిజన సంక్షేమం కోసం రూ.2,800 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ కోసం రూ.40 వేల కోట్లు కేటాయించాం. సామాజిక అసమానతలు ఉన్నాయి బడ్జెట్, బడ్జెట్ యేతర రుణాలను FRBM కింద చూస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక సమానత్వంలో భాగంగానే బడ్జెట్ కేటాయింపులు చేశాం. రాష్ట్రంలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయి. వీటిని తొలగించేందుకు కృషి చేశాం. గత ప్రభుత్వ హయాంలో కేటాయింపులకు నిధులు అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పథకాలు, హామీల మేరకే వాస్తవ బడ్జెట్‌ను రూపొందించారం. గతంలో ప్రతి సంవత్సరం 20 శాతం బడ్జెట్ పెంచుకుంటూ పోయారు. అలాగే వాస్తవాలకు దూరంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. TSPSCని ప్రక్షాళన చేశాం పది సంవత్సరాలుగా.. గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువత ఎంతగానో ఎదురుచూశారు. చివరికి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చాం. ఇందుకోసం రూ.40 కోట్లు మంజూరు చేశారు. గ్రూప్-1 పోస్టులకు మరో 64 పోస్టులను అదనంగా మంజూరు చేశాం. పోలీసు నియామక సంస్థ ద్వారా 13,444 పోస్టులను భర్తీ చేశారం. యువత కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని'భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పదేళ్లుగా గ్రూప్-1 ఉద్యోగాల కోసం యువత ఎదురు చూశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చాం. ఇప్పటికే రూ.40కోట్లు మంజూరు చేశాం. గ్రూప్-1లో 503 పోస్టులకు అదనంగా 64 పోస్టులు మంజూరు చేశాం. పోలీసు నియామక సంస్థ ద్వారా 13,444 పోస్టుల భర్తీ పూర్తి చేశాం. యువత కలల సాకారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని భట్టి విక్రమార్క తెలిపారు. Also Read: ఆసరా పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్ #telugu-news #telangana-news #batti-vikramarka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి