/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BIKE-jpg.webp)
స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ప్రతిఒక్కరి చేతిలోకి మొబైల్ ఫోన్లు వచ్చేశాయి. ప్రతి వినియోగదారుడు కూడా కొన్ని గంటల సేపు సోషల్ మీడియాను వాడుతున్నారు. కొంతమంది తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరైతే ఎలాగైనా ఫేమస్ అవ్వాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ.. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది రీల్స్ చూస్తున్నారు. లాంగ్ వీడియోస్ కంటే వీటికే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది వింత వింత రీల్స్ చేస్తూ అప్‌లోడ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రజలకు ఆటంకం కలిగించేలా కూడా రీల్స్ చేస్తున్నారు.
Also Read: కొత్త ఎక్స్ ఖాతా తెరచిన కేసీఆర్.. కాంగ్రెస్‌పై ఫైర్
అయితే తాజాగా ఓ వింత రీల్ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై కూర్చి వేసుకొని కూర్చుకున్నాడు. పక్కనే తన బైక్ కూడా ఉంది. రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పటికీ కూడా అతను అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది. చివరికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
VIDEO | Delhi Police arrested a person after his reel went viral on social media. In the video, the person can be seen sitting on a chair in the middle of the road along with his motorcycle.
(Source: Third Party/PTI)
(Full video available on PTI Videos -… pic.twitter.com/WfN95iYciT
— Press Trust of India (@PTI_News) April 27, 2024
Also Read: నోటా’ పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు!