Kavitha: లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితకు నోటీసులు..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సోమవారం నోటీసులు పంపంచింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై లాయర్లతో కవిత చర్చిస్తున్నట్లు సమాచారం.

New Update
Kavitha: లిక్కర్ స్కాం కేసులో మరోసారి కవితకు నోటీసులు..!

BIG BREAKING:  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) సోమవారం నోటీసులు పంపంచింది. రేపు (మంగళవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు విచారణకు వెళ్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2023 మార్చిలో మూడు రోజులపాటు కవితను ఈడీ విచారించగా.. ఈడీ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బలవంతపు చర్యలు..
ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును ఆమె కోరారు. నళిని చిదంబరం కేసులో మాదిరి ఉపశమనం కోరుతున్నానన్నారు. మహిళల విచారణకు సంబంధించిన మార్గదర‌్శకాలపై కూడా కవిత స్పష్టత చేయాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. ఈడీ విచారణను సవాలు చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడంపై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది.

ఇది కూడా చదవండి : BSP Mayavathi:ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన మాయావతి..ఒంటరిగానే బరిలోకి

మధ్యంతర ఉత్తర్వులు..
అలాగే పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 20కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామన్నారు. అయితే అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికలు..
ఇక లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈడీ నోటీసులు పంపడం రాజకీయ వర్గాల్లో టెన్సన్ మొదలైంది. ఇదే లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ నాలుగుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరుకాకపోవడం విశేషం. కాగా ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్‌ గ్రూప్‌కు సంబంధించిన వ్యవహారాల్లో కవిత లీడ్‌ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అంతేకాదు అప్రూవర్‌గా మారిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు