Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌పై హై కోర్టు తీర్పు ఎప్పుడంటే

లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్‌ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌ బెయిల్‌పై మంగళవారం కోర్టు తీర్పునివ్వనుంది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్‌ విషయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఈడీ.. హైకోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈడీ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.

Also Read: రాజ్యాంగంపై దాడిని అనుమతించం: రాహుల్ గాంధీ

అయితే హైకోర్టు కేజ్రీవాల్‌ బెయిన్‌ నిలిపివేయడంతో.. ఆయన సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తాము మధ్యంతర స్టే విషయంలో జోక్యం చేసుకోమని.. హైకోర్టు తుది తీర్పు తర్వాతే దీనిపై విచారిస్తామని పేర్కొంది. ఇక మంగళవారం బెయిల్‌పై తీర్పు రానుండటంతో ఆప్ పార్టీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు