Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట..సీఎం పదవిపై పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఢిల్లీ కేజ్రీవాల్‌కు మళ్ళీ కాస్త ఊరట లభించింది. రిమాండ్ మీద తీహార్ జైల్లో ఉంటున్న కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలు అయిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బెంచ్ తోసిపుచ్చింది. మేమెలా చెబుతామంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది.

New Update
Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట..సీఎం పదవిపై పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

Delhi CM Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు(High Court) తోసి పుచ్చింది. జైల్లో ఉన్న ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్‌ను హిందూసేన అధ్యక్షుడు విష్ణుగుప్తా వేశారు. దీని మీద జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడాతో కూడిన బెంచ్‌ విచారణ జరిపింది. ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు.

మాకు ఆ అధికారం లేదు..సలహా కూడా ఇవ్వలేం..

సీఎం పదవిలో కొనసాగాలే లేదా అనే అంశం కేజ్రీవాల్(Kejriwal) వ్యక్తిగతం కిందకు వస్తుంది. దాని గురించి ఆయనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పింది హైకోర్టు బెంచ్. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోగలరు తప్ప తాము ఏమీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదని కోర్టు ఎలా చెప్పగదని ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్కకు ఏం చేయాలో బాగా తెలుసునని...ఆయనకు మా సలహాలు ఏమీ అవసరం లేదని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ పిటిషన్ దాఖలు కావడం ఇది రెండోసారి. అంతకు ముందు సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు.

బెయిల్‌పై ఉత్కంఠత..

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi Liquor Scam Case) లో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందా? అనే ఉత్కంఠత నెలకొంది.

Also Read : Telangana: తెలంగాణకు బీర్‌దెబ్బ..నీళ్ళు లేక తయారీ కష్టమంటున్న కంపెనీలు

Advertisment
Advertisment
తాజా కథనాలు