ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. లీకేజీలు, కూలిపోవడాలు, పగుళ్లు.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి!

ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌-1 పైకప్పు కూలడం, ఒక వ్యక్తి మరణించడంతో బీజేపీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అయెధ్య రామమందిరం గర్భగుడిలో వాటర్‌ లీకేజీ, జవాన్ల శిబిరాల్లో వరద నీరు, ముంబై అటల్ సేతుపై పగుళ్లను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

New Update
ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. లీకేజీలు, కూలిపోవడాలు, పగుళ్లు.. గల్లి నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి!

Ayodhya to Delhi Collapses and Leakages:
అది 2022 జున్ 19, ప్రగతి మైదాన్‌ సొరంగం ప్రారంభోత్సవం మోదీ చేతుల మీదగా అట్టహాసంగా జరిగింది. రూ.777 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. అయితే ఈ హడావుడి, ఆర్భాటం ఎందుకున్న ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వినిపించడానికి ఎక్కువ కాలం కూడా పట్టలేదు. టన్నెల్‌ ప్రారంభమైన పది రోజుల్లోనే సొరంగాన్ని వరదలు ముంచేశాయి. పట్టుమని సంవత్సరం తిరగకముందే టన్నెల్‌ పనికి రాకుండా పోయింది. రూ.777 కోట్ల ధనం వృధా అయ్యింది. గత 10ఏళ్లలో ఈ తరహా ఘటనలు అనేకం జరిగాయని చెబుతోంది కాంగ్రెస్‌ పార్టీ. ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించడం వల్లే ఇలా జరుగుతాయని ఆరోపిస్తోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌-1లో టాప్‌ రూఫ్‌ కూలి ఓ వ్యక్తి మరణించడంతో బీజేపీపై కాంగ్రెస్‌ విరుచుకుపడుతోంది. గత 10ఏళ్లలో ఇలాంటి ఘటనలు చాలా జరిగినా బీజేపీ తీరు మారలేదని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడి మల్లి ఖర్జున్‌ ఖర్గే ఫైర్ అయ్యారు.


ఇక ఇటివలీ కాలంలో జరిగిన నిర్మాణాల ప్రమాదాలపై ఓ సారి లుక్కేద్దాం:

1) ఢిల్లీ ఎయిర్‌పోర్టు రూఫ్‌ టాప్‌: (జూన్ 28, 2024)
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుడండంతో ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌ (Indira Gandhi Airport) లోని టెర్మినల్‌-1 పై కప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడగా..వారిలో ఒకరు మృతి చెందారు. అయితే ఈ టెర్మినల్‌ను మోదీనే ప్రారంభించారని కాంగ్రెస్‌ విమర్శల దాడి చేసింది. దీనికి బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది. టెర్మినల్‌-1 2009లో కాంగ్రెస్‌ హయంలో నిర్మించారని బీజేపీ చెబుతోంది. ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణ చేసుకుంటున్నారు. అటు సామాన్యులు మాత్రం దేశ రాజధానిలో ఈ తరహా ఘటన జరగడం సిగ్గు చేటని మండిపడుతున్నారు.


2) జబల్‌పూర్ విమానాశ్రయం రూఫ్‌ టాప్‌:(జూన్ 27, 2024)
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ భవనం రూఫ్‌ టాప్‌ కూలిపోయింది. జూన్ 27, 2024న కురిసిన భారీ వర్షానికి రూఫ్‌ టాప్‌ కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది.. ఈ కారు ఆదాయపు పన్ను శాఖ అధికారికి చెందినదిగా సమాచారం. టెర్మినల్ బిల్డింగ్ మెయిన్ గేటు బయట ఈ కారు పార్క్ చేసి ఉంది. అయితే ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.


3) అయోధ్య రామ మందిరం గర్భ గుడి వాటర్‌ లీకేజీ: (జూన్ 24, 2024)
వర్షం కురిసినప్పుడు అయోధ్య రామమందిర మొదటి అంతస్తు నుంచి వర్షపు నీరు గర్భగుడిలోకి వస్తున్నట్లు అయోధ్య రామ మందిర ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ చెప్పడం సంచలనం రేపింది. పైకప్పు నుంచి నీటి లీకేజీ సమస్య ఉన్న మాట నిజమేనని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర అంగీరించారు. ఇక భారీ వర్షాలకు జూన్ 27న అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొవెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ జవాన్ల శిబిరాల్లోకి వరద నీరు చేరింది. మీర్జాపూర్‌-కాన్షీరాం కాలనీలో ఉన్న జవాన్ల శిబిరాలు నీట మునిగిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.


4) ముంబై అటల్ సేతుపై పగుళ్లు? (జూన్ 21, 2024)
ముంబైలో కొత్తగా ప్రారంభించిన అటల్‌ సముద్ర వంతెనపై పగుళ్లు కనిపించడం కలకలం రేపింది. ప్రజల భద్రతపై ఆందోళన కలిగింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రం వంతెనపై పగుళ్లు రాలేదని చెప్పుకొచ్చారు. వంతెనను నగరానికి కలిపే సర్వీస్ రోడ్డులో పగుళ్లు వచ్చాయని స్పష్టం చేశారు. అయితే ఈ పగుళ్ల అయినా ఎందుకు వచ్చాయని కాంగ్రెస్‌ నిలదీస్తోంది.


5) మోర్బీ వంతెన కూలిపోవడం (అక్టోబర్‌ 30, 2022)
2022లో గుజరాత్‌ మోర్బీ వంతెన కూలిపోయిన ఘటనలో ఏకంగా 135 మంది ప్రాణాలు కోల్పోయారు. సిట్‌ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో కేబుల్‌పై దాదాపు సగం వైర్లు తుప్పు పట్టినట్లు తేలింది. బ్రిడ్జి ముందున్న ప్రధాన కేబుల్ తెగిపోవడం వల్లే వంతెన కూలిపోయిందని సిట్ విచారణలో తేలింది. పునరుద్ధరణ సమయంలో పాత సస్పెండర్లను కొత్త రాడ్లతో వెల్డింగ్ చేసినట్లు సిట్ తన నివేదికలో కనుగొంది. ఇదొక్కటే కాదు, జనరల్ బోర్డు ఆమోదం లేకుండానే మోర్బీ మున్సిపాలిటీ కాంట్రాక్టు ఇచ్చిందని కూడా సిట్ నివేదిక స్పష్టం చేసింది.ఆ తర్వాత ఒరేవా గ్రూపు మరమ్మతుల కోసం వంతెనను మూసి ఉంచి అక్టోబర్ 26న అనుమతి లేకుండా తెరిచింది. దీంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.


Also Read: ఎయిర్ టెల్, వోడాఫోన్ మొబైల్ యూజర్స్ కు షాక్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు