Deepfake : ఏంటీ డీప్‎ఫేక్ వీడియోలు..వీటిని ఎలా తయారు చేస్తారు? నకిలీ, అసలును గుర్తించడం ఎలా?

డీప్ ఫేక్ ..వీడియో అంటే ఏమిటి? ప్రముఖ నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ పదంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కోసం హెడింగ్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదవండి.

New Update
Deepfake : ఏంటీ డీప్‎ఫేక్ వీడియోలు..వీటిని ఎలా తయారు చేస్తారు? నకిలీ, అసలును గుర్తించడం ఎలా?

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనతో తాను చాలా బాధపడినట్లు నటి వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్ తోపాటు ఎందరో ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి విషయాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ డీప్ ఫేక్ వీడియో అంటే ఏమిటి? దీనిని ఎలా గుర్తించవచ్చు? పూర్తి వివరాలను తెలుసుకుందాం.

డీప్ ఫేక్ వీడియో అంటే ఏమిటి?
రియల్ వీడియోలో వేరొకరి ముఖాన్ని అమర్చడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో డీప్ లెర్నింగ్ అనేక స్పెషల్ మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించడాన్నే డీప్ ఫేక్ అంటారు. ఈ పద్ధతిని ఉపయోగించడం వల్ల వీడియో, ఫొటో, ఆడియోలో సులభంగా మార్పులు చేసుకోవచ్చు. ఈ సాధనాన్ని ఉపయోగించడం వల్ల ఫేక్ ఏదో, రియల్ ఏదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. నిజానికి డీప్ ఫేక్ లను మొదట్లో చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ సోషల్ మీడియా విస్తరిస్తున్నా కొద్దీ అది చూపించే ప్రభావం పెరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో సోషల్ మీడియా కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియో భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవీ ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశమూ లేకపోలేదు.

ఈ డీప్ ఫేక్ వీడియోను మొదట చేసిందేవరు?
వాస్తవానికి డీప్ ఫేక్ కంటెంట్ ను మొదటిసారిగా 2014లో సింథటిక్ మీడియా అని పిలుస్తుండేవారు. తర్వాత దానికి జనాదరణ పెరగడంతో 2017లో రెడ్డిట్ నిర్వహాకులు జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్ వర్స్క్ టెక్నిక్ ను ఉపయోగించి మొదటిసారి డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే అశ్లీల వీడియోలకు సెలబ్రెటీల ముఖాలు పెట్టడంతో దానికి మంచి ఆదరణ లభించింది. 2018 నాటికి ఈ సాంకేతికతను మరింత డెవలప్ చేశారు. దీనికి ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ కూడా తోడవ్వడంతో మరింత పవర్ ఫుల్ గా మారింది. డీప్ ఫేక్ వీడియోలను ఎన్ కోడర్, డీకోడర్ నెట్ వర్క్ ల కలయికను ఉపయోగించి క్రియేట్ చే్తాను. ఫేక్ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ కూడా ఒరిజనిల్ వీడియోలో ఉండేలా ఎన్ కోడర్, డీకోడర్ నెట్ వర్స్క్ ఫిల్టర్ చేస్తాయి. అందుకే డీప్ ఫేక్ వీడియోలు అంత క్లియర్ గా ఒరిజినల్ వీడియో మాదిరిగానే కనిపిస్తుంది.

ఒరిజినకల్, ఫేక్ వీడియోలను గుర్తించడం ఎలా?
డీప్ ఫేర్ వీడియోలను నిశితంగా పరిశీలించడం ద్వారా గుర్తించవచ్చని ఏఐ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ వీడియోలను క్రియేట్ చేయడం చాలా సులభమైన పని. కానీ ముఖ కవలికలు, చర్మం రంగు, లైటింగ్ ను ఒరిజినల్ వీడియోలో ఉన్నట్లు డిఫ్ మేకర్స్ మాత్రం చేయలేరు. కంటిరెప్పల కదలికల ద్వారా డీప్ ఫేక్ వీడియోలను గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. డీప్ ఫేక్ వీడియోలను ఏఐ సాయంతో క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలో ఏఐ ద్వారా చేసిన వీడియోల్లో లిప్ సింకింగ్ ఎర్రర్స్ క్లియర్ గా కనిపిస్తాయి. వీడియోను ఎవరు షేర్ చేస్తున్నారు? సెలబ్రెటీ చేస్తున్నారా? లేక గుర్తుతెలియని అకౌంట్ నుంచి షేర్ చేశారా? అన్న సంగతి గమనించాలి.

ఇది కూడా చదవండి:  నా దమ్ము కేసీఆర్‎కు తెలుసు..ఆర్టీవీకి నీలం మధు సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
తాజా కథనాలు