ఉగ్రవాదులతో డిబెట్లా? కెనడాతో ఉద్రిక్తతల వేళ టీవీ ఛానళ్లకు కేంద్రం హెచ్చరిక..!!

కెనడా భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ దేశంలోని ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్ర సర్కార్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఇంటర్య్వూలు చేయడం మానుకోవాలంటూ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్ కు సలహా ఇచ్చింది కేంద్రం.

New Update
India Cananda Row : మీ వాళ్లను తీసుకుపోండి..కెనడాకు భారత్ వార్నింగ్..!!

ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో ఇంటర్వ్యూలు చేయడం మానుకోవలని కేంద్రం ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్ కు హెచ్చరికలు జారీచేసింది. సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన బహిరంగ ఆరోపణలపై ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో ఈ అడ్వైజరీ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వేర్పాటు వాద నేత, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను ఒక టెలివిజన్ ఛానెల్లో ప్రత్యక్షమయ్యాడు. అయితే కేంద్రం జారీ చేసిన అడ్వైజరీలో పన్నూ, కెనడా పేర్లను ప్రస్తావించలేదు కేంద్రం.

ఇది కూడా చదవండి: ఏపీ సీఐడీ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ…నెక్ట్స్ ఏం జరగబోతోంది..?

భారత్ లో చట్టం ద్వారా నిషేధించిన సంస్థకు చెందిన ఉగ్రవాదంతో సహా తీవ్రమైన కేసులున్న విదేశాల్లోని వ్యక్తిని టెలివిజన్ ఛానెల్లో చర్చకు ఆహ్వానించినట్లు ప్రసార మంత్రిత్వశాఖ దృష్టికి వచ్చింది. గురుపత్వంత్ సింగ్ పన్ను దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భారత్ భద్రత, విదేశంతో ఇండియా స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే వ్యాఖ్యలెన్నో చేశాడు. దేశంలోని పబ్లిక్ ఆర్డర్ కు కూడా భంగం కలిగించే ఛాన్స్ ఉందని సమాచార మంత్రిత్వ శాఖ అడ్వైజరీలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: చంద్రబాబు కష్టడీ పిటీషన్‌పై తీర్పు రేపటికి వాయిదా

ప్రభుత్వం మీడియాస్వేచ్చను సమర్థిస్తూనే రాజ్యాంగం ప్రకారం దాని హక్కులను గౌరవిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం, టీవీ ఛానెల్స్ ప్రసారం చేసే కంటెంట్ సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ 2తోపాటు సీటీఎన్ చట్టం, 1995 లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలని అడ్వైజరీ పేర్కొంది. పై కారణాలతో టెలివిజన్ ఛానెల్స్ తీవ్రమైన నేరాలు, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న సంస్థలకు చెందిన వారితోపాటు అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తుల గురించి నివేదికలు, వీక్షణలకు ఎలాంటి ఫ్లాట్ ఫాం ఇవ్వకూడదని కేంద్రం సూచించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2)కింద నిర్దేశించిన సీటీఎన్ చట్టంలోని సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ 2కిందన సహేతుకమైన పరిమితులకు సంబంధించి చట్టం ద్వారా నిషేధించినదని అడ్వైజరీ పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు