Maoist: సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేశారు.ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయని ఆరోపించారు. ఈ మరణహోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు.

New Update
Maoist: సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

ఇటీవల దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మావోయిస్టులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట సంచలన లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. ' ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలో మరణ హోమం జరిగింది. 5 నెలల్లో 27 ఎన్ కౌంటర్లు,18 ఫేక్ ఎన్ కౌంటర్లు జరిగాయి. 107 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 45 మంది వరకు సాధారణ పౌరులే ఉన్నారు. చర్చలకు సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.

Also read: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..

ప్రధాని మోదీ, అమిత్ షా, విష్ణు దేవ్ సాయి, విజయ్ శర్మ ఆదేశాలతోనే మావోయిస్టులపై దాడులు జరిగాయి. భద్రతా బలగాల విజయాల కోసం.. పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మృతులను చిత్రీకరిస్తున్నారు. శత్రుదేశాలపై యుద్ధం తరహాలో మావోయిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు. భారీగా సాయుధ బలగాలను మోహరించి మారణహోమాన్ని సృష్టిస్తున్నారు. యుద్ధ ట్యాంకులను మోహరిస్తున్నారు. వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలతో డ్రోన్లు, హెలికాఫ్టర్ల ద్వారా దాడులకు తెగబడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రజాసంఘాలకు, సానుభూతి పరులు అలర్ట్ గా ఉండాలి. దండకారణ్యంలో జరుగుతున్న మారణ హోమానికి బీజేపీ నేతలే బాధ్యత వహించాలంటూ' లేఖలో పేర్కొన్నారు.

Also Read: ఇంట్లో ఈ వంటలు చేస్తున్నారా అయితే డేంజరే అంటున్న ఐసీఎంఆర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు