CWC Meeting : హైదరాబాద్ లో ఈరోజు, రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు

సీడబ్ల్యూసీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు, రేపు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ ముఖ్య నేతలు అందరూ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భేటీ మొదలవనుంది.

New Update
CWC Meeting : హైదరాబాద్ లో ఈరోజు, రేపు సీడబ్ల్యూసీ సమావేశాలు

హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో అతిరథమహారథులు అందరూ దీనికి హాజరవుతున్నారు. శనివారం నాడు టీపీసీసీ...సీడబ్లూసీకి విందు ఇవ్వనుంది. ఇది అయ్యాక సమావేశాలు మొదలవుతాయి.

5 కీలక అంశాలు....

ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఐదు కీలక అంశాల మీద చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో మొదటిది త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. 2. భారత్ జోడో యాత్ర నిర్వహణ 3. 2024 లోక్ సభ ఎన్నికలు 4. ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు 5. ఈనెల 18 నుంచి ప్రారంభం అవనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిల మీద కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చించనున్నారు.

ఇవి కాకుండా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టాల్సిన పోరాటాలు వంటి విషయాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మామూలుగా ఎప్పుడూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే CWC సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది తెలంగాణలో సమావేశంలో నిర్వహిస్తుండటంతో.. అధిష్ఠానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చని సీనియర్‌ నేతలు చెబుతున్నారు.  ప్రజలకు కూడా ఈ విషయాన్నే చెప్పాలనే లక్ష్యంతోనే సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరవుతారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు