చనిపోయిందని భర్త అంత్యక్రియలు.. మూడేళ్ల తరువాత లవర్తో భార్య ప్రత్యక్షం!

పెళ్లైన ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో పరారైంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు కూడా చేశాడు. అయితే మూడేళ్ల తరువాత ఆమె ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది.

New Update
missing wife case

missing wife case

పెళ్లైన ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో పరారైంది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. భార్య మరణించిందటూ ఓ మృతదేహానికి భర్త అంత్యక్రియలు కూడా చేశాడు. తమ కూతుర్ని అల్లుడే చంపాడంటూ అత్తింటివారు పోలీసు కేసు పెట్టడంతో భర్త జైలు పాలయ్యాడు.  ఎలాగోలా జైలు నుంచి రిలీజ్ అయ్యాడా ఆ భర్త . ఇదంతా మూడేళ్ల క్రితం స్టోరీ..  పారిపోయిన తన భార్య తాజాగా ప్రియుడితో కలిసి ప్రత్యక్షమైంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలోని బసవనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. 

వారిని చూసుకోవడానికైనా రావాలంటూ

సురేశ్, మల్లిగె దంపతులుకు ఇద్దరు పిల్లలు..  కూలిపని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆమెకు మరోవ్యక్తితో ఆక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో ప్రియుడితో కలిసి ఆమె వెళ్లిపోయింది. మల్లిగెకి ఫోన్‌ చేసి తనతో సంసారం చేయకున్నా పర్వాలేదు కానీ ఇద్దరు పిల్లలున్నారు. వారిని చూసుకోవడానికైనా రావాలంటూ ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆమె మనసు కరగలేదు. దీంతో చేసేది ఏమీ లేక సురేశ్‌ 2021లో కుశాలనగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యా్ప్తు చేపట్టారు. అయితే 2022లో సురేశ్‌కు కుశాలనగర పోలీసులు ఫోన్‌ చేసి మీ భార్య మృతదేహం లభించినట్లుగా సురేష్ కు సమాచారం ఇచ్చారు. 

సురేశ్‌తో పాటు మల్లిగె తల్లి గౌరిని పిరియాపట్టణ పోలీసులు తీసుకెళ్లి బెట్టదపురలో ఓ అస్తిపంజరాన్ని చూపించారు. ఇది మల్లిగెది అని వారు గుర్తించారు. దీంతో అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయించారు.  అయితే తన అల్లుడే తన కూతుర్ని చంపాడంటూ అత్త గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేశ్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. అయితే  రెండేళ్లు తరువాత డీఎన్‌ఎ పరీక్షల రిపోర్ట్‌ లో ఆమె ఎవరి శవమో అని తెలియడంతో సురేశ్‌ జైలు నుంచి రిలీజ్ చేశారు.  

అయితే మూడేళ్లు ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తున్న మల్లిగె 2025 ఏప్రిల్ 1వ తేదీన తన ప్రియునితో కలిసి ప్రత్యక్షమైంది. మడికేరిలోని ఒక హోటల్‌లో సురేశ్‌ స్నేహితులు ఆమె ఫోటో తీసి సురేశ్‌కు, పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాను ఇష్టంతోనే ప్రియుడితో వెళ్లినట్లుగా మల్లిగె వెల్లడించింది. ఆమెను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి  మైసూరు జైలుకు తరలించారు. అయితే ఆమె భర్త అంత్యక్రియలు చేసిన  శవం ఎవరిదనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Also read : Drugs: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురు నైజీరియన్లు అరెస్టు

Advertisment
Advertisment
Advertisment