Vizag Crime: కూతురు న్యూడ్ వీడియోలు తీశాడని.. ఆమె ఫ్యామిలీ ఏం చేసిందో చూడండి!

విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. పక్కింట్లో ఉండే యువతి న్యూడ్ వీడియోలు తీశాడని ఆమె కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. ఈ క్రమంలో ఆ యువకుడు గదిలో ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

New Update

Vizag Crime:  విశాఖ జిల్లా గాజువాకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కనీస విచక్షణ కోల్పోయిన ఓ యువకుడు.. యువతి స్నానం చేస్తుండగా  వీడియోలు తీశాడు. ఇది గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే యువకుడిని పట్టుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అతడిని చితకబాదారు. తండ్రికి సమాచారం ఇస్తామని చెప్పి గదిలో బంధించారు. దీంతో తీవ్ర ఆందోళనకు,  అవమానానికి గురైన నిందితుడు గదిలోనే ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also Read: RC16: 20 ఏళ్ళు వెనక్కి వెళ్లి.. RC16 షూటింగ్ కోసం బుచ్చిబాబు పెద్ద ప్లానింగ్!

బాత్రూం లో స్నానం చేస్తుండగా.. 

పోలీసుల వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన భాస్కర్ రావు ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.   గాజువాక శ్రీనగర్ కాలనీలో యువతి తాతయ్య ఇంట్లో రెంటుకు ఉంటూ ఉద్యోగానికి వెళ్తున్నాడు. అయితే  కొద్దిరోజుల క్రితమే  ఓనర్ మనవరాలు ఊరు నుంచి అక్కడికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె నిన్న బాత్రూం లో స్నానం చేస్తుండగా భాస్కర్ రావు  వీడియో తీశాడు.  ఇది గమనించిన యువతి ఒక్కసారిగా కేకలు వేసింది.అయితే ఫస్ట్ ఫ్లోర్ లోని ఓనర్ బాత్రూమ్ కొంత ఓపెన్ గా ఉంటుంది.

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

 యువతి అరవడంతో భాస్కర్ రావు వెంటనే గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న యువతి బంధువులు, స్థానికులు అతడిని బాగా కొట్టారు. ఫోన్ లో నుంచి వీడియోలు డిలీట్ చేశారు. మీ తలిదండ్రులకు సమాచారం అందిస్తామని చెప్పి నిందితుడిని గదిలో బంధించారు. దీంతో తీవ్ర అవమానం, ఆందోళనకు గురైన భాస్కర్ రావు రూమ్ లోని కేబుల్ వైర్లతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  మరోవైపు అమ్మాయి బంధువులే తన కొడుకును కొట్టి చంపేశారని భాస్కర్ రావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ఇప్పటికే యువతికి సంబంధించిన ఐదుగురు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment