/rtv/media/media_files/2026/05/25/vizag-murder-2026-05-25-13-23-02.jpg)
Vizag murder
విశాఖపట్నంలోని భీమిలి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వడదెబ్బ ముసుగులో ఓ భార్య తన భర్తను దారుణంగా హత్య చేసింది. భార్య నాగమణి భర్త సూరిబాబును చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బ కారణంగా పడిపోయాడంటూ ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే నాగమణిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా? లేదా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ పనికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Bengaluru : ఘోరం: డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధురాలికి రూ.24 కోట్ల టోకరా!
Follow Us