ACB: ఏసీబీ వలలో స్కూల్ ప్రిన్సిపల్.. అనాథ పిల్లలతో అసభ్యంగా..

ఫుడ్ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటూ హైదరాబాద్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్‌ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. దీంతోపాటు స్కూల్లో ఉండే అనాథ ఆడపిల్లలతో ప్రభుదాస్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 

New Update
drerdrw4e

Hyderabad : ఆయన అవినీతి ప్రిన్సిపల్ మాత్రమే కాదు ఓ కీచకుడు కూడా. అడ్డగోలుగా లంచాలు తీసుకుంటూ.. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న నీచుడి బాగోతం ఎట్టకేలకు బయటపడింది. ఈ మేరకు ఫుడ్ కాంట్రాక్టు విషయంలో లంచం తీసుకుంటూ సరూర్ నగర్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్‌ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ ఏసీబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఫుడ్ కాంట్రాక్ట్‌ లో అవకతవకలపై ఫిర్యాదులు అందడంతో ప్రభుదాస్‌పై నిఘా పెట్టిన ఏసీబీ.. కాంట్రాక్టర్‌ నుంచి రూ.29 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. 

అనాథ ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన..

ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని ప్రభుదాస్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆయన దగ్గర అక్రమాస్తులు ఉన్నట్లు తేలితే  కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపింది. ఇదిలా ఉంటే.. ప్రభుదాస్ అమ్మాయిలపట్ల అరాచకంగా వ్యవహరించినట్లు బయటపడింది. తన స్కూల్లో ఉండే అనాథ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్‌ టెండర్ల విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. పాఠశాల నిధులను కూడా పక్కదారి పట్టించి భారీగా డబ్బు దండుకున్నాడని పలువరు ఆరోపిస్తున్నారు. 

Also Read :  ఇజ్రాయెల్‌ చేతిలో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతం! ఎవరీ నజ్రల్లా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు

హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి నగర్లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో 30 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మరోవైపు సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

New Update
BREAKING NEWS

breaking news

హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్లో ఉన్న ఓ గుడిసెలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త చుట్టు పక్కల వ్యాపించడంతో దాదాపు 30 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మరోవైపు కాలిపోతున్న గుడెసెల్లో ఉన్న సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో ఉంది. 

 

telugu-news | fire accident | latest-telugu-news | hyd | HYD Crime

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు