/rtv/media/media_files/2025/03/19/tCGH8vR94ibBgmdzDxsV.jpg)
UP CRIME
అతడు ఒక నేవీ ఉద్యోగి... భార్యను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఎన్నో కలలతో జీవితాన్ని మొదలు పెట్టాడు. కానీ ఆ ప్రేమే అతడి పాలిట యమపాశం అవుతుందని ఊహించుకోలేకపోయాడు. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది భార్య. లవర్ తో కలిసి భర్తను చంపి.. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి.. శరీర భాగాలను సిమెంట్ తో నింపిన ప్లాస్టిక్ డ్రమ్ లో కప్పి పెట్టారు. రెండు గంటల పాటు కష్టపడిన పోలీసులు డ్రమ్ ని తెరవలేకపోయారు. చివరికి డ్రమ్‌ను కత్తిరించగా.. శరీర భాగాలు సిమెంట్ తో గడ్డకట్టిపోయి ఉన్నాయి. ఈ ఒళ్లుగగ్గుర్పొడిచే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది.
Also Read : క్రూ-9 సిబ్బందికి అభినందనలు..స్పేస్ ఎక్స్ పాత్ర అద్భుతం-నాసా
ప్రేమ వివాహం
మర్చంట్ నేవీలో పనిచేస్తున్న సౌరవ్ కుమార్ 2016 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకోవడంతో సౌరవ్ తన కుటుంబానికి మధ్య వివాదం జరిగింది. ఆ తర్వాత మూడు సంవత్సరాల క్రితం, సౌరభ్ తన భార్య ముస్కాన్‌తో కలిసి ఇందిరానగర్‌లోని అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అతనికి రెండవ తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ట్రంప్ కు ఫెడరల్ కోర్టు నుంచి మరో ఎదురు దెబ్బ..ఆ నిషేధాన్ని నిలిపేయాలని..
సిమెంట్ తో గడ్డకట్టిన శవం
అయితే నేవీలో పనిచేస్తున్న సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్‌లోని వచ్చాడు. ఈలోపు ప్రియుడి కోసం భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్.. భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. ఆ తర్వాత ముస్కాన్ లేదా సౌరభ్‌ను ఎవరూ చూడలేదని స్థానికులు తెలిపారు. తీరా చూస్తే.. ముస్కాన్.. తన ప్రేమికుడితో కలిసి భర్త సౌరభ్‌ను హత్య చేసినట్లు ఆమె తల్లి చెప్పింది. దీంతో ముస్కాన్ తల్లి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూతురి కిరాతకాన్ని బయటపెట్టింది.
అనంతరం పోలీసులు ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరభ్‌ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టింది. ఇరుగుపొరుగువారి డౌట్ రాకుండా ఇంటి లోపలే దాచిపెట్టారు. పోలీసులు ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!
2 గంటలు శ్రమించిన పోలీసులు
2 గంటలు ప్రయత్నించినప్పటికీ, మృతదేహాన్ని డ్రమ్ నుంచి బయటకు తీయలేకపోయారు. చివరకు, పోలీసులు మృతదేహంతో పాటు డ్రమ్‌ను పోస్ట్‌మార్టం ఇంటికి పంపారు. చాలా కష్టపడి, డ్రమ్‌ను కత్తిరించి మృతదేహాన్ని బయటకు తీశారు.
ఈ కేసులో, మీరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ మాట్లాడుతూ, సాయంత్రం బ్రహ్మపురి పోలీసులకు ఇందిరా నగర్‌లో హత్య జరిగినట్లు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేసి అనుమానితులను విచారించగా.. మార్చి 4న
సాహిల్, ముస్కాన్‌తో కలిసి సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించారు. హత్య తర్వాత, మృతదేహాన్ని ముక్కలుగా కోసి, డ్రమ్ములో వేసి, సిమెంట్ ద్రావణంతో నింపారు. సౌరవ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సాహిల్, ముస్కాన్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు.
Also Read : ఇజ్రాయెల్, హమాస్ వార్.. దాడుల్లో 400 మంది మృతి