పొలంలో పాడుపని చేస్తూ భర్తకు దొరికిన భార్య...ప్రియుడితో కలిసి లేపేసింది!

పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

New Update
wife kill husband

wife kill husband

పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా వాడారు.  అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..   దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

సునీల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనీష్ భార్య రూబీకి ముగ్గురు పిల్లలున్నారు. అయితే రూబీకి సునీల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది.  గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఈ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం మనీష్ తెలియడంతో ఆమెను మందలించాడు. ఈ విషయంలో మనీష్, రూబీ మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. అయితే ఇటీవల పొలం పనుల కోసమని వెళ్లిన రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో మనీష్ అనుమానంతో వెళ్లి చూడగా అక్కడ రూబీ, సునీల్‌లు అభ్యంతరకరమైన స్థితిలో కనిపించారు. .

దీంతో అక్కడే రూబీ,మనీష్ ల మధ్య గొడవ మొదలైంది. దీంతో తన వెంట తెచ్చుకున్న పిస్టల్‌తో సునీల్.. మనీష్ ను కాల్చి చంపేశాడు. పోలీసుల విచారణలో రూబీ స్కెచ్ వేసి మరి పొలానికి వెళ్లిందని..అక్కడే ప్రియుడితో భర్తను చంపాలని ప్లాన్ వేసిందని విచారణలో తేలింది. సంఘటనలో ఉపయోగించిన పిస్టల్‌తో పాటు, కార్ట్రిడ్జ్‌లు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : భర్తతో 20ఏళ్లు గ్యాప్.. క్లాస్మెట్తో శారీరక సుఖం.. అమీన్పూర్ కేసులో సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment