ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సమీర్ అనే వ్యక్తి భార్య వేరే వ్యక్తితో కారులో ఉండటాన్ని గమినించాడు. దీంతో తన బైక్‌తో కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ కారు నడిపిన హసన్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. సమీర్ బానెట్‌పై ఉండగానే హైస్పీడ్‌తో కిలోమీటర్ల మేర వరకు డ్రైవ్ చేశాడు. దీంతో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. సమీర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. హసన్‌ను అరెస్టు చేసి కారును పోలీసులు సీజ్ చేశారు.
Just an ordinary day in UP aka Uttar Pradesh !
— NanSense (@NanSense) January 17, 2025
Boyfriend taking the wife on a ride inside the car and her husband outside teh car 🚗 😜
Mauj hai ji mauj hai 😎 #UttarPradesh#Moradabadpic.twitter.com/vBEUg2Dhv6
ఇది కూడా చూడండి: Rinku Singh: పెళ్లికి సిద్ధమైన క్రికెటర్.. యంగ్ ఎంపీతో త్వరలో వివాహం
స్కూల్‌కు వెళ్తున్న బాలికపై..
ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్తున్న ఓ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లోడీలో ఓ బాలిక కుటుంబంతో కలిసి ఉంటుంది. ఉదయం స్కూల్‌కి వెళ్తున్న సమయంలో ఆమెను ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేసి ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
ఇంతలో బాలిక స్కూల్‌కు రాలేదని ఉపాధ్యాయులు తండ్రికి కాల్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వస్తుండగా రోడ్డు పక్కన ఆ బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. భారతీయ న్యాయ సంహితలోని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా..ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?