/rtv/media/media_files/2025/03/19/ghZVCqamdfbxzvOztD21.jpg)
College girls Theft in Uttarpradesh
కాలేజీ విద్యార్థినులు చదువుకోకుండా దొంగలు మారిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఇద్దరు విద్యార్థినులు కాలేజీకి వెళ్లకుండా ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లారు. ఆ ఇంట్లో నుంచి రూ.7.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగతనం చేశారు. బరేలీలోని షీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు బీఎస్సీ చదువుతున్నారు.
उत्तर प्रदेश के बरेली में कॉलेज में पढ़ने वाली दो छात्राओं को एक घर से 7.5 लाख रुपये मूल्य के सोने के ज्वेलरी चोरी करने के आरोप में गिरफ्तार किया गया है.#UPNews #Bareilly https://t.co/GVoriu3EJQ
— AajTak (@aajtak) March 18, 2025
ఇది కూడా చూడండి: NASA: సునీతా విలియమ్స్ వచ్చేస్తున్నారు..క్రూ డ్రాగన్ ల్యాండింగ్ లైవ్
షూ రాక్‌లో ఉన్న తాళం తీసి..
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఎవరైతే ఇంటి తాళం షూ రాక్‌లో ఉంచుతారో అలాంటి ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఓ కొడుకు తల్లికి కాల్ చేసి షూ రాక్‌లో ఇంటి తాళం ఉంచామని చెప్పడంతో అది విని ఈ ఇద్దరు విద్యార్థినులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు అన్ని కూడా తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: TG Budget 2025: నేడే తెలంగాణ బడ్జెట్.. ఆ పథకాలకు భారీగా నిధులు?
ఆ తల్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నగలు కనిపించలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ఇద్దరు విద్యార్థినులు దొంగతనం చేసినట్లు తేలింది. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేసి జ్యూడిషీయల్ కస్టడీలో ఉంచారు.
ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!