/rtv/media/media_files/2025/04/10/gqizyOSCWOIuQRTiCSC8.jpg)
CRIME Photograph: (CRIME)
ఈ మోడ్రన్ ప్రపంచంలో రోజురోజుకి దారుణాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులు ఏదో ఒక కారణంతో పిల్లలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ తల్లి తన సొంత కూతురినే కడతేర్చింది. తన మాట వినకపోవడంతోనే తన 11 ఏళ్ల కూతురిని గొంతు కోసి దారుణంగా చంపింది.
ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
Woman kills 11 yr old Daughter. I'm sure people can now guess the reason (justification) that was mentioned behind the Mother's behaviour.
— Vasu Ericsson (@VasuEricsson) April 9, 2025
Not all Women. But always women topping the charts of #MothersKillingChildren https://t.co/hf66oinCMU pic.twitter.com/k7ccanq41d
ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
కూతురు మారం చేయడంతో..
అత్త ఇంటికి వెళ్తా అని 11 ఏళ్ల కూతురు అల్లరి చేయడంతో తల్లి తన కూతురు మెడ పట్టుకుని నేలపై పడేసింది. దీంతో ఆ 11 ఏళ్ల బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. మానసిక సరిగ్గా లేకపోవడం వల్ల తల్లి ఇలా చేసిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలో కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల పాప వితన్య రెడ్డిని కన్న తల్లి సాహితీ గొంతు నలిపి చంపింది. అనంతరం సాహితీ ఫ్యానుకు ఊరి వేసుకుంది. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో సాహితీ ఈ దారుణానికి ఒడిగట్టింది. సాహితీ భర్త LICలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం