/rtv/media/media_files/2025/02/17/FgLFSnttprZPVQvRcvxw.jpg)
Ponzi Scam
దేశవ్యాప్తంగా 6వేలమందికి పైగా డిపాజిటర్లను మోసం చేసిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన రూ. 850 కోట్ల పోంజీ స్కీమ్ (Ponzi Scam) కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మీరు పెట్టే పెట్టుబడికి అధిక రాబడి చూపిస్తామని స్వల్పకాలిక డిపాజిట్లు చేయమని ప్రజలను ఒప్పించి మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 19 మందిని నిందితులుగా పేర్కొనగా, వారిలో ఇద్దరిని అరెస్టు చేశామని, మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.
Also Read : ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Capital Protection Force Pvt Ltd) ఉపాధ్యక్షుడు, ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్ బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఒదేల, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కావ్య నల్లూరిని శనివారం అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్ తెలిపారు.
Also Read : ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్‌కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే!
Also Read : తెలుగు సెట్ లో నాకు పదే పదే అది చెబుతూ వేధింపులు .. శ్వేతా బసు సంచలనం
22 శాతం మేర లాభంతో
ఈ కేసులో ప్రధాన నిందితులైన ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ కుమార్ , సీఈవోలు ఆర్యన్ సింగ్, యుగేందర్ సింగ్.. పవన్ కుమార్, కావ్యలతో కలిసి ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో ఓ మొబైల్ యాప్ తో పాటుగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 45 నుంచి 180 రోజుల వ్యవధిలో 11 శాతం నుంచి 22 శాతం మేర లాభంతో విడతల వారీగా తిరిగిస్తామని పబ్లిసిటీ చేశారు. అలా 2021 నుంచి డిపాజిట్ల సేకరించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ (Hyderabad) తో పాటుగా చుట్టపక్కల ప్రాంతాలకు చెందిన 6 వేల979 మంది నుంచి రూ.1,700 కోట్లు సేకరించారు. అయితే ఇందు లో రూ.850 కోట్లను డిపాజిటర్లకు వెనక్కి ఇవ్వగా.. మరో రూ.850 కోట్లు చెల్లింపులు చేయలేదు. కొంతకాలంగా చెల్లింపులు ఆపేసి సంక్రాంతికి పండగకు ముందు ఆఫీసును మూసేశారు. అయితే విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది.
Also Read : అప్పులే కారణామా? .. ఫ్యామిలీ మొత్తం సూసైడ్.. ముందుగా విషం ఇచ్చి..