మార్ఫింగ్ ఫోటోలతో బెదిరించి ఒకడు.. వీడియో తీసి మరోకడు..స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడి

స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ముందుగా గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో  ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధింపులకు గురిచేశాడు.

New Update
morphed photos

స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో  ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా బ్లాక్ మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. అయితే ఈ తతంగాన్నంతా వీడియో రికార్డ్ చేశాడు మరో బాలుడు. ఆ వీడియో చూపించి ఆ బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో  వీడియో షూట్ చేసిన ఫోన్ పగలగొట్టింది బాలిక. ఈ విషయంలో వారి ఇద్దరి మధ్య గొడవపడుతుండగా చూసి బాలికను మరో బాలుడు వేధించడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని రోజులుగా బాలికను ముగ్గురు మైనర్ బాలుర్లు వేధించడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయాన్ని  ఆమె ఫ్రెండ్స్ బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులపై పలు సెక్షన్ల కింద ముగ్గురు మైనర్లపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం

ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అందరికీ న్యాయం జరిగే కోర్టులోనే మహిళా ఉద్యోగికి లైంగిక వేధింపులు ఎదురైయ్యాయి. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉద్యోగి మహిళా ఉద్యోగిరాలిని లైంగికంగా వేధింస్తున్నాడు. సదరు మహిళతో కోర్టు బెంచ్‌ క్లర్క్ సత్యనారాయణ నీచపు పనులు ఒడిగట్టాడు. అసభ్యంగా తాకుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ట్యూబెక్టమీ చేయించుకున్నావా.. ఎంజాయ్ చేద్దామా అంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. నీకు ఏం కావాలన్నా అడుగు చేస్తా.. నాకు కావాల్సింది నాకు ఇచ్చేయ్ అంటూ వేధిస్తున్నాడని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సహకరిస్తే ఉద్యోగం పర్మినెంట్ చేయిస్తానంటూ సత్యనారాయణ  ఆఫర్లు ఇచ్చాడు. క్లర్క్ సత్యనారాయణ వేధింపులు తాళలేక సదరు మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించింది. ఆ మహిళా ఉద్యోగి సత్యనారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. BNS సెక్షన్ 74, 75, 78 కింద కేసు నమోదు చేశారు.

Also read :  ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోని

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు.

author-image
By Krishna
New Update

విశాఖలో దారుణ హత్యకు గురైన గర్భిణి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  అనూష అనే నిండు గర్భిణి తన భర్త జ్ఞానేశ్వర్‌ చేతిలో దారుణ హత్యకు గురి కాగా..  కేజీహెచ్‌ ఆస్పత్రిలో మంగళవారం అనూష మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. గర్భం నుంచి ఆడ మృత శిశువును డాక్టర్లు  బయటకి తీశారు. అక్కడికి చేరుకున్న అనూష బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు  జ్ఞానేశ్వర్‌ ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.  ఇలాంటి వాడిని ఉరిశిక్ష సరైనదని కోరుతున్నారు. కాగా నిందితుడు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు భీమిలి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.

Also read :   రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

ప్రేమించి పెళ్లి చేసుకుని 

గెద్దాడ జ్ఞానేశ్వర్, అనూష (27) 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు.  రెండు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నడుపుతోన్న జ్ఞానేశ్వర్ తన భార్యకు అతని కుటుంబ సభ్యులను మాత్రం పరిచయం చేయలేదు.  అత్తమామల వద్దకు వెళ్దామని ఆమె ఎప్పుడు అడిగినా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు.  ఓసారి తనకు క్యాన్సర్ ఉందని చెప్పి విడాకులు తీసుకుందామని నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటూ భార్యను మోసం చేయాలని అనుకున్నాడు. కానీ ఆమె నీతోనే జీవితమని తెగేసి చెప్పింది. దీంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని...   నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ ఎరగనట్లు స్థానికులతో కలిసి కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం ఒప్పుకున్నాడు.  

Also read : ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు