రాజస్థాన్‌లో తెలంగాణ పోలీస్ సీక్రెట్ ఆపరేషన్.. 27 మంది అరెస్ట్! రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ అయింది. 20 రోజులపాటు సోదాలు నిర్వహించి 27 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేరగాళ్లు తెలంగాణలో రూ.9కోట్లు దోచేసినట్లు సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. By srinivas 01 Oct 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Cyber Crime: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు రాజస్థాన్‌లో చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటూ భారీగా దోచుకుంటున్న 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసింది. ఈ మేరకు రాజస్థాన్ సైబర్ ముఠాపై దేశవ్యాప్తంగా పలు సైబ్ నేరాలు నమోదవగా.. 20 రోజులపాటు జయపుర, నాగౌర్, జోధ్‌పూర్‌లో సోదాలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 31 బ్యాంక్ చెక్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.114కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించాం.. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 2,233 సైబర్ కేసులు నమోదవగా తెలంగాణలో 189 రిజిస్టర్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో సైబర్ నేరగాళ్ల అరెస్టుకు బంధించి వివరాలను వెల్లడించిన గోయల్.. అనుమానిత లింక్స్ క్లిక్ చేయొద్దని సూచించారు. 'ఈ ముఠా 29 ఫేక్ అకౌంట్స్ ద్వారా రూ.11.01కోట్లు లూటీ చేసింది. తెలంగాణలో వీరు 189 కేసుల్లో రూ.9కోట్లు దోచేశారు. రూ.114కోట్లను బాధితులకు తిరిగి ఇప్పించాం. నిందితుల వద్ద 13 ఏటీఎం కార్డులు, ఏడు చెక్‌బుక్, రెండు హార్డ్‌డిస్క్‌లు, 31 సెల్ఫోన్లు, 37 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నాం. పోలీసుల నిఘా పెరగడంతో ఈ ముఠాలు మారమూల గ్రామాలపై దృష్టి పెడుతున్నాయని గోయల్ చెప్పారు. సైబర్ నేరాలకు హబ్.. రాజస్థాన్ ముఠా రాష్ట్రంలో భారీగా నేరాలకు పాల్పడింది. దక్షిణ ఆసియా సైబర్ నేరాలకు హబ్‌లా మారాయి. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్లో ఫిర్యాదు చేయాలి. టెక్నికల్ అవెడిన్స్ ఆధారంగానే ఈ నిందితులను పట్టుకోగలిగాం. స్పెషల్ ఆపరేషన్ కోసం మరిన్ని ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నామని గోయల్ తెలిపారు. #hyderabad #cyber-crime #rajasthan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి