/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండలం చింతామాన్‌పల్లికి చెందిన పల్లె పోచయ్యకు ఈరబోయిన రమేశ్(35) కారును విక్రయించాడు. అయితే కొంత డబ్బు ఇచ్చిన మిగతా డబ్బు లోన్ లేదా ఈఎంఐ ద్వారా చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. రమేశ్‌ను ఆ సంస్థ వారు ఇబ్బంది పెట్టడంతో పోచయ్య వద్ద ఉన్న కారును తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.
స్తంభానికి కట్టేసి దారుణంగా..
ఈ సమయంలో పోచయ్య, రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. పోచయ్య అల్లుడు హరీశ్, ఇటుక బట్టీ కార్మికులతో కలిసి రమేశ్‌ను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో రమేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రమేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !
ఇదిలా ఉండగా ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లే కర్కషంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపింది. తర్వాత ఆమె కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం తల్లి రజిత పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను జీరంగూడ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!
బుధవారం రాత్రి పిల్లలు తినే అన్నంలో విషం కలపి ఇచ్చింది తల్లి. దీంతో ముగ్గురు చిన్నారులు నిద్రలోనే చనిపోయారు. సాయి క్రిష్ణ (12), మధుప్రియ(10), గౌతమ్ (8) ముగ్గురు చనిపోయారు. కుటుంబ తగాదాలే కారణమా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ