తెలంగాణలో కలకలం రేపుతున్న పరువు హత్య.. గొడ్డలితో నరికి అతి కిరాతకంగా!

తెలంగాణలోని పెద్దపల్లిలో పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ తండ్రి యువకుడిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

New Update

తెలంగాణలో పరువు హత్య కలకలం రేపుతోంది. కూతురిని ప్రేమించాడని తండ్రి ఓ యువకుడిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం పరిధిలో ముప్పిరితోట గ్రామంలో సాయి కుమార్ అనే యువకుడు ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు.

ఇది కూడా చూడండి: IPL 2025: SRHకు నిరాశ.. లక్నో సూపర్ జెయింట్స్‌ విక్టరీ

పుట్టిన రోజు నాడే..

ఈ విషయం తండ్రికి తెలియడంతో ఆ యువకుడి పుట్టిన రోజు నాడే గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. దీంతో సాయి కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Ganja: గంజాయి బ్యాచ్‌కు బిగ్ షాక్.. తాగినా, అమ్మినా పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా!

ఇదిలా ఉండగా ఇటీవల కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దోమకొండ మండలం చింతామాన్‌పల్లికి చెందిన పల్లె పోచయ్యకు ఈరబోయిన రమేశ్‌(35)  కారును విక్రయించాడు. అయితే కొంత డబ్బు ఇచ్చిన మిగతా డబ్బు లోన్ లేదా ఈఎంఐ ద్వారా చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నారు. రమేశ్‌ను ఆ సంస్థ వారు ఇబ్బంది పెట్టడంతో పోచయ్య వద్ద ఉన్న కారును తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.

ఇది కూడా చూడండి: Gold Rates-Trump: మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు..!

ఈ సమయంలో పోచయ్య, రమేష్ మధ్య వాగ్వాదం జరిగింది. పోచయ్య అల్లుడు హరీశ్, ఇటుక బట్టీ కార్మికులతో కలిసి రమేశ్‌ను స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో రమేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రమేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు