/rtv/media/media_files/2025/04/08/NZduZcGRzl8EZLAIwuZJ.jpg)
Kamareddy issues Photograph: (Kamareddy issues)
కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారంతా ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ కల్తీ కల్లు వల్ల ఒక్కసారిగా మతిస్థిమితం కోల్పోయారు. వింతగా ప్రవర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
కామారెడ్డిలో కల్లు తాగి 15 మందికి తీవ్ర అస్వస్థత
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2025
బిర్కూర్ మండలంలోని దామరంచ, నసుర్లబాద్ మండలంలోని అంకోల్, దుర్కి, సంగ్యం గ్రామాలలో నిన్న రాత్రి, ఈ రోజు పొద్దున కల్లు తాగి సుమారు 15 మంది తీవ్ర అస్వస్థత
వారిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఉన్నతాధికారుల… pic.twitter.com/4H5hect5cw
ఇది కూడా చూడండి: Today Gold Rate: కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
కల్తీ కల్లు తాగిన వారి పరిస్థితి విషమం..
ఈ కల్తీ కల్లు తాగిన వారిలో కొందరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణానికి వెళ్లి శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆ కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను సబ్ కలెక్టర్ వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిని కల్లు దుకాణాలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీ కల్లు వల్ల ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోవాలని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వాటిని పూర్తిగా క్లోజ్ చేయాలని, ఇలాంటి వాటికి అసలు పర్మిషన్లు ఇవ్వకూడదని స్థానికులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Ap Aqua -Trump Effect: ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు