Suryapet Murder: వాన్ని చంపండి.. మనవళ్లను రెచ్చగొట్టిన నానమ్మ.. సూర్యాపేట కేసులో సంచలన విషయాలు!

సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మనే హత్యకు పరోక్షంగా కారణమని పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఆమె కృష్ణనను చంపేయమని కొడుకు, మనవళ్లను రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది.

New Update

Suryapet Murder: సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  కృష్ణ అలియాస్‌ మాలబంటి హత్య కేసులో ఇప్పటికే  భార్గవి కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరినీ  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు  సమాచారం. భార్గవి అన్న కోట్ల నవీన్ ను ప్రధాన నిందితుడిగా తేల్చారు. అయితే కృష్ణ హత్యలో భార్గవి నాన్నమ్మ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదటి నుంచి మనవరాలు కులాంతర వివాహం చేసుకోవడం  ఇష్టంలేని భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మ కోపంతో రగిలిపోయింది. కృష్ణనను చంపేయమని తన కొడుకు, మనవళ్లను రెచ్చగొట్టి పరోక్షంగా హత్యకు కారణమైనట్లు విచారణలో తేలింది. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

నాన్నమ్మకు శవం చూపించి.. 

స్నేహం పేరుతో తన ఇంటికి వచ్చిన కృష్ణ.. తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో భార్గవి అన్న నవీన్ కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంతోనే మరో స్నేహితుడు బైరి మహేష్ ద్వారా కృష్ణను ట్రాప్ చేసి హత్య చేశాడు. ఆదివారం రాత్రి 9గంటలకు కృష్ణను చంపిన నిందితులు.. తెల్లవారుజాము వరకు  మృతదేహాన్ని కారు డిక్కీలోనే పెట్టుకొని షికారు చేశారు.  చంపిన తర్వాత ముందుగా కృష్ణ మృతదేహాన్ని.. పాత సూర్యాపేటలో తమ బంధువుల ఇంట్లో ఉన్న భార్గవి నాన్నమ్మ బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచారట. ఆ తర్వాత నల్గొండలో ఉన్న మరో స్నేహితుడికి కూడా మృతదేహాన్ని చూపించేందుకు వెళ్లారు. 

రాత్రంతా శవంతోనే 

ఇలా రాత్రంతా శవాన్ని కారు డిక్కీలో పెట్టుకొని తిరిగారు. ముందుగా నల్గొండ పరిసరాల్లోనే శవాన్ని వదిలేయాలని భావించారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యపేటకు తీసుకొచ్చారు. చివరిగా పిల్లలమర్రి సమీపంలోని మూసీ కాల్వకట్టపై కృష్ణ డెడ్ బాడీని పడేసి పరారయ్యారు. చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని నవీన్ రెండు నెలల నుంచే  కృష్ణను హత్యకు ప్లాన్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్‌, నల్గొండకు చెందిన మరో యువకుడి సహాయం తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే మహేష్ కృష్ణతో స్నేహంగా నటించాడు. అలా కృష్ణను ట్రాప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. 

Also Read: Double ISMART: తెలుగులో ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ లో డబుల్ ఇస్మార్ట్ సర్ప్రైజ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు