Suryapet honour killing: సూర్యాపేట పరువు హత్య పై ప్రెస్ మీట్ నిర్వహించిన ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టారు. కృష్ణ అలియాస్ మాల బంటి కేసులో ఏ-1గా అమ్మాయి అన్నయ్యలు, నానమ్మ, తండ్రితో పాటు మరో ఇద్దరిపై ఎఫైఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో ఏ1 గా అమ్మాయి అన్నయ్యను, ఏ4గా నానమ్మను చేర్చినట్లు తెలిపారు. నిందితులు కృష్ణను చంపేందుకు ఎటువంటి ఆయుధాలు వాడలేదని కేవలం చేతులతోనే చంపినట్లు తెలిపారు. చంపిన తర్వాత శవాన్ని పాత సూర్యాపేటలో ఉన్న తమ నానమ్మకు చూపించారని.. ఆ తర్వాత నల్గొండలోని స్నేహితుడు సాయి చరణ్ కి చూపించడానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ముందుగా నల్గొండ పరిసరాల్లోనే శవాన్ని వదిలేయాలని భావించారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో తిరిగి సూర్యపేటకు తీసుకొచ్చి పడేసినట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!
గతంలోనూ ప్రయత్నాలు..
అమ్మాయి అన్నయ్యలు నవీన్, వంశీ.. స్నేహితులు బైరి మహేష్, సాయి చరణ్ తో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. గతంలో కూడా రెండు మూడు సార్లు చంపేదుకు ప్రయతించగా.. వాళ్ళ ప్లాన్స్ విఫలమయ్యాయని. ఇప్పుడు పక్కాగా ప్లాన్ చేసి హత్య చేశారని తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత నిందితుల నుంచి ఒక ఎర్టిగా కారు, 5 సెల్ఫోన్లు, ఒక కత్తి, ప్లాస్టిక్ సంచి, తాడు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు నవీన్, బైరు మహేష్, వంశీ, సాయి చరణ్ అలాగే అమ్మాయి తండ్రి, నాన్నమ్మలపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అమ్మాయి అన్నయ్య నవీన్ పై 4 కేసులు నమోదవగా.. అందులో ఒకటి అటెంప్ట్ మర్డర్ కేసు. బైరి మహేష్ పై 9 కేసులు, నవీన్ బ్రదర్ వంశీపై 2 కేసులు, సాయి చరణ్ పై 1 కేసు, అమ్మాయి ఫాదర్ పై 2 కేసులు, నాన్నమ్మ పై 1 కేసు ఉన్నట్లు తెలిపారు. అలాగే మృతుడు కృష్ణ పై కూడా 4 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.