ఇంత పిరికోడివి ఏంట్రా.. ప్రేమ, పెళ్లన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి పారిపోయాడు!

ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు. తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయి ప్రణీత్‌(26) బెంగళూరులో ఓ యువతితో పరిచయం కాగా అది ప్రేమగా మారింది.

author-image
By Krishna
New Update
marriage cheating

ప్రేమన్నాడు.. నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లాన్నాడు.  తన అవసరం తీరాక ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..  సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన సాయి ప్రణీత్‌(26) బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు.  అక్కడ ప్రొస్థెటిక్‌ ఆర్థోటిక్‌ క్లినిక్‌లో పనిచేసే ఓ యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువతి తండ్రికి గుండెపోటు రావడంతో ఆమె చూడటానికి ఒడిశాకు వెళ్లింది. 

అయితే యువతి తండ్రి యోగక్షేమాలు తెలుసుకునేందుకు  సాయి ప్రణీత్ సదరు యువతితో నిత్యం ఫోన్ లో మాట్లాడుతుండేవాడు.  దీంతో వారి మధ్య స్నేహం మరింతగా పెరిగి అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరు ఓ సారి కేరళ టూర్ కు కూడా వెళ్లారు. అక్కడ హోటల్‌లో ఆమెకు ప్రపోజ్ చేసి నుదుటిపై బొట్టు పెట్టి ఇదే పెళ్లంటూ ఆమెను నమ్మించి దగ్గరయ్యాడు సాయి ప్రణీత్.  కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలకాడు. 

గోవాలో మరింత దగ్గర 

2023 డిసెంబర్ లో ఇద్దరు కలిసి షిర్డీకి వెళ్లారు. అక్కడికి వచ్చిన సాయి ప్రణీత్‌ తన తల్లిదండ్రులను, చెల్లెలిని ఆమెకు పరిచయం చేశాడు. అనంతరం నేరుగా గోవాకు వెళ్లి అక్కడ ఆమెకు మరింత దగ్గరయ్యాడు సాయి ప్రణీత్ . 2024లో యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు రాగా.. ఆమె బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి  బెంగళూరుకు పిలిపించాడు.  ఇద్దరు కలుసుకోవడానికి బాగా దూరం అవుతుందని ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యాడు సాయి ప్రణీత్ .  ఇద్దరు కలిసి జూబ్లీహిల్స్‌లో  ఓ ఫ్లాట్‌ ను  అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు.  

అయితే  గతేడాది నవంబరులో తన చెల్లికి పెళ్లి కుదిరిందని చెప్పిన సాయి ప్రణీత్..  మంచిర్యాల జిల్లాలోని  తన సొంతూరికి వెళ్లిపోయాడు. ఇక  అప్పటి నుంచి ఆమెతో మాట్లాడటం మానేశాడు. అనుమానంతో సదరు యువతి సాయి ప్రణీత్ ను  నిలదీయగా రూ.20లక్షలిస్తానని, తనతో బంధం తెంచుకోవాలని కోరాడు. అందుకు నిరాకరించిన యువతి నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీసలుకు ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: హైదరాబాద్‌లో లారీ బీభత్సం..ట్రాఫిక్ పోలీసు దుర్మరణం!

హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌ వద్ద విధుల్లోవున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update
ACCIDENT

ACCIDENT

Accident: హైదరాబాద్‌లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హోంగార్డ్‌ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరాపోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

యూటర్న్‌ సమీపంలో అదుపుతప్పి..

ఈ మేరకు కూకట్‌పల్లి నుంచి మియాపూర్‌ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. దీంతో యూటర్న్‌ సమీపంలో ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. అయితే అక్కడ ట్రాఫిక్‌ విధులు నిర్వర్తిస్తున్న రాజవర్ధన్, వికేందర్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింహాచలం మరణించారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చదవండి:  పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!

ఇదిలా ఉంటే..హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి.  ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: ఆఫీసు పనిలో సహోద్యోగులు ఎగతాళి చేస్తున్నారా.. ఇలా చేయండి

lorry | traffic-police | today telugu news

Advertisment
Advertisment
Advertisment