Sexual Assault : అయిన వారే ఆగం చేస్తున్నారు.. చిన్నారులపై అఘాయిత్యాల కేసుల్లో షాకింగ్ విషయాలు! దేశంలో బాలికలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2024లో కుటుంబ సభ్యులు లేదా పరిచయం ఉన్న వారిచేత 90 శాతం మంది వేధింపులకు గురైనట్లు కేసుల లెక్కలు చెబుతున్నాయి. 2022లో వెయ్యికిపైగా కుటుంబ హింస కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. By srinivas 29 Sep 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Sexual Assault : మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు భారతదేశంలో ప్రధాన సమస్యగా కొనసాగుతున్నాయి. కేవలం బయట వాళ్లతోనే కాకుండా చాలామంది ఇంటి మనుషుల వల్ల లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కన్న తండ్రితో మొదలుపెడితే అన్నా, తమ్ముడు, బావ, మామ తదితరులు ఆడపిల్లలను శారీరకంగా టార్చర్ చేస్తున్న సంఘటనలు సంచలనం రేపుతున్నాయి. 2022లో దేశంలో దాదాపు 1000కి పైగా కుటుంబ హింస కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశమే. కాగా 2024 లోనూ 90 శాతం మంది కుటుంబ సభ్యులు లేదా పరిచయం ఉన్న వారిచేత వేధింపులకు గురైనట్లు కేసుల లెక్కలు చెబుతున్నాయి. చైల్డ్ లైన్ సర్వేలో సంచలన నిజాలు.. కరోనా లాక్‌డౌన్‌ల సమయంలో కుంటుంబాల్లో లైంగిక వేధింపులు మరింత పెరిగాయి. చిన్న పిల్లలను సైతం వదలకుండా మద్యం మత్తులో బెదిరించి కామాంధులు వాంఛ తీర్చుకున్నారు. చాలా మంది బాధితులు అయిష్టంగానే వారికి లొంగిపోవడం, ముఖ్యంగా బంధువులు చేసిన నేరాలను బహిర్గతం చేయలేకపోయినట్లు చైల్డ్ లైన్ సర్వేలో బయటపడింది. కుటుంబ ఒత్తిడి, బెదిరింపులు.. ఆడ పిల్లలను రక్షించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POCSO) చట్టంపై అవగాహన ఉన్నప్పటికీ కుటుంబ ఒత్తిడి, బెదిరింపుల కారణంగా చాలా నేరాలు బయటకు చెప్పలేకపోతున్నట్లు చైల్డ్ లైన్ తెలిపింది. భారతదేశ కుటుంబాల్లో లైంగిక వేధింపులు, దుర్వినియోగం, పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం ఆందోళనగా కలిగిస్తోందని పేర్కొంది. చట్టాలపై అవగాహన లోపం.. నాలుగు సంవత్సరాల డేటా ఆధారంగా ఈ నేరాలలో ఎక్కువ భాగం బాధితురాలికి తెలిసిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు లేదా తెలిసిన పెద్దలే దాడులకు పాల్పడ్డట్లు వెల్లడైందని స్పష్టం చేశారు. ఒక్క కేరళలోనే 2022లో 1,000 మంది పిల్లలు వారి స్వంత ఇళ్లలోనే లైంగిక వేధింపులకు గురయ్యారు. వీటిలో 462 కేసులు కుటుంబ సభ్యులకు సంబంధించినవి. ఆడ పిల్లలపై లైంగిక హింసలో ఎక్కువ భాగం వారికి సన్నిహితంగా ఉన్నవారే కావడం గమనార్హం. కాగా భారతదేశంలో ఇలాంటి దారుణాలు జరగకుండా, పిల్లలను రక్షించడానికి విద్య, చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందని UNICEF వంటి సంస్థలు నొక్కి చెబుతున్నాయి. ఎక్కడెక్కడ ఘోరాలు జరిగాయంటే.. - తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్థిని ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. - జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపింది. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై జానీ లైంగిక దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. - ఇటీవల బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్లే ‘హమ్‌సఫర్’ ఎక్స్‌ప్రెస్ రైలులో 11 ఏళ్ల బాలికపై ఓ రైల్వే ఉద్యోగి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబంతోపాటు ప్రయాణికులు అతణ్ని కొట్టి చంపారు. - రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8ఏళ్ళ బాలికపై 50ఏళ్ళ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బోడ నరసింహ అనే వ్యక్తి బాలికకు చాక్లెట్ ఆశ చూపి లైంగికదాడికి పాల్పడ్డాడు. - సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలిక పై ముస్లిం యువకుడు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. - అరుణాచల్‌ప్రదేశ్ షియోమి జిల్లా ప్రభుత్వ రెసిడెన్సియల్ స్కూల్లో వార్డెన్ గా పనిచేస్తున్న యుంకెన్ బాగ్రా.. 2014 నుంచి 2022 వరకు 21 మంది స్టూడెంట్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఏడుగురు అబ్బాయిలు కూడా ఉన్నారు. బాలిక పేరెంట్స్ 2022 నవంబర్ లో మోనిగాంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. - యూట్యూబ్ స్టార్, ఫోక్ సింగర్ మల్లిక్‌తేజ్ మాయమాటలు చెప్పి తనపై లైంగిక దాడి చేశాడంటూ ఓ యువతి జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. - యూట్యూబర్ హర్షసాయి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా లైంగిక దాడి చేశాడంటూ ఓ సినీనటి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. Also Read : IIFA ఉత్సవంలో మెరిసిన టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు #telangana #andrapradesh #rape-case #sexual-assault మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి