/rtv/media/media_files/2025/04/05/JrtRWnbpTctBKfylviYd.jpg)
fack doctor Photograph: (fack doctor)
మధ్యప్రదేశ్ దామోహ్‌లో ఓ డాక్టర్ ఏడుగురిని ప్రాణాలను బలిగొన్నాడు. బ్రిటన్ నుంచి వచ్చిన ఫేమస్ కార్డియాలజిస్ట్ అని చెప్పుకుంటూ.. ఎన్. జాన్ కెమ్ ఆయన పేరని చెప్పుకున్నాడు. వాస్తవానికి అతని అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్. గొప్ప కార్డియాలజిస్ట్ డాక్టర్ అని చెప్పుకొని ప్రైవేట్ మిషనరీ హాస్పిటల్‌లో చేరాడు. ఈ తరహాలోనే కొందమంది రోగులకు హార్ట్ సర్జరీలు చేయగా.. అందులో ఏడుగురు పేషెంట్లు చనిపోయారు.
Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ
ఈ ఫేక్ డాక్టర్ బాధిత రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నరేంద్ర విక్రమాదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. అతని మెడికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ గురించి ఆరాతీస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు, న్యాయవాది ఈ విషయంపై మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు.
Madhya Pradesh: Fake doctor performs heart surgery in missionary hospital; allegedly kills 7
— ANI Digital (@ani_digital) April 5, 2025
Read @ANI | Story https://t.co/M468hBk6bi#MadhyaPradesh #FakeDoctor #PatientDeaths pic.twitter.com/fOZQV7Wf75
జిల్లా దర్యాప్తు బృందం ఆసుపత్రి నుండి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో ఆ నకిలీ వ్యక్తి ప్రముఖ బ్రిటిష్ వైద్యుడి మాదిరిగానే నకిలీ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడైంది. నిందితుడు హైదరాబాద్‌లో నమోదైన క్రిమినల్ కేసుతో సహా అనేక వివాదాల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?