Bengaluru : బెంగళూరులో దారుణం :  లవర్కు మరో పెళ్లి కుదిరిందని.. దారుణంగా చంపేశాడు!

బెంగళూరులోని ఓ అద్దె ఇంట్లో 22 ఏళ్ల యువతి శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో ఆమె ప్రియుడు విషం తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

New Update
benguluru

బెంగళూరులోని ఓ అద్దె ఇంట్లో 22 ఏళ్ల యువతి శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అదే సమయంలో ఆమె ప్రియుడు విషం తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించడానికి ఆడిన నాటకంలా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. చనిపోయిన యువతిని భవానీ ఎస్ (22)గా గుర్తించారు. ఆమె ఒక మొబైల్ ఫోన్ షోరూంలో పని చేస్తూ, అద్దెకు ఉంటోంది. విషం తాగి ఆసుపత్రి పాలై, ప్రాణాలతో బయటపడిన ఆమె ప్రియుడు చందన్  ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భవానీ, చంద్రశేఖర్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా, తమ కుటుంబాలకు కూడా చెప్పకుండా సుమారు ఏడాది క్రితం వాళ్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, చంద్రశేఖర్‌కు అప్పటికే వేరే ఆమితో పెళ్లయింది. పైగా మొదటి భార్యతో అతనికి ఆరేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడని పోలీసులు చెప్పారు.

జూన్ 13న భవానీ మరణం వెలుగులోకి వచ్చింది. ఇన్స్‌టాగ్రామ్‌లో భవానీ, చంద్రశేఖర్ కలిసి ఉన్న ఒక ఫోటోను చూసి ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. తమ మొదటి పెళ్లి రోజు సందర్భంగా చంద్రశేఖర్ ఆ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో పెట్టినట్లు తెలుస్తోంది. అది చూసి షాక్ అయిన కుటుంబ సభ్యులు భవానీకి వరుసగా ఫోన్లు చేశారు.

ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తకపోవడంతో, అనుమానం వచ్చిన భవానీ తండ్రి ఆమె ఉంటున్న ఇంటి ఓనర్‌కు ఫోన్ చేశాడు. ఓనర్, చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూసేసరికి ఇల్లు లోపల నుంచి లాక్ చేసి ఉంది. ఎలాగోలా తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లి చూడగా, భవానీ అప్పటికే చనిపోయి పడి ఉంది. పక్కనే చంద్రశేఖర్ స్పృహ తప్పి పడి ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఫిర్యాదులో కీలక విషయాలు

భవానీ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు చెప్పాడు. భవానీకి త్వరలోనే పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారని, వచ్చే వారమే ఆమెకు నిశ్చితార్థం కూడా జరగాల్సి ఉందని ఆయన చెప్పారు. ఈ పెళ్లి విషయం భవానీ తన ప్రియుడు చంద్రశేఖర్‌కు చెప్పి ఉంటుందని, ఆ తర్వాతే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రాథమిక విచారణను బట్టి పోలీసులు ఏమంటున్నారంటే.. ఇద్దరం కలిసి విషం తాగి చనిపోదామని భవానీని చంద్రశేఖర్ ఒప్పించి ఉంటాడు. కానీ, భవానీ విషం తాగిన తర్వాత వాంతి చేసుకోవడంతో.. చంద్రశేఖర్ ఆమె గొంతు నులిమి చంపేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఆమెను చంపిన తర్వాత, అతను మరింత విషం తాగి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం భవానీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా ఇద్దరూ కలిసి చనిపోవాలనుకున్నప్పుడు జరిగిన ఒప్పందమా, లేక ముందుగానే ప్లాన్ చేసి చేసిన మర్డరా అనేది తేల్చడానికి ఫోరెన్సిక్, మెడికల్ రిపోర్టుల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఆ ఇద్దరూ దాదాపు ఏడాదిగా ఆ ఇంట్లో కలిసే ఉంటున్నారని, భార్యాభర్తలమని అందరికీ చెప్పుకున్నారని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు. వాళ్ల మధ్య ఎప్పుడూ పెద్దగా గొడవలు జరిగినట్లు తమకు తెలియదని స్థానికులు అన్నారు. 

Advertisment
తాజా కథనాలు