/rtv/media/media_files/2025/02/09/Ar2Xv4DEDMZ42Z84A9lV.jpg)
Sangareddy crime
Sangareddy crime: 9వ తరగతి చదువుకుంటున్న తన కూతురితో చనువుగా ఉంటున్నాడని ఓ వ్యక్తిని చంపి తలబెట్టాడు ఆ బాలిక తండ్రి. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా మెగ్యా నాయక్ తండాలో చోటుచేసుకుంది. అసలు వివరాల్లోకి వెళితే..
Also Read: Laila Movie: మరీ దారుణం.. లైలా ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి!
చంపి.. తలబెట్టి..
మెగ్యా నాయక్ తండాకు చెందిన గోపాల్ అనే వ్యక్తికి 9వ తరగతి చదువుతున్న కూతురు ఉంది. అయితే రామచందర్ తండాకు చెందిన దశరథ్ అనే వ్యక్తి తన కూతురితో చనువుగా ఉండడం కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు గోపాల్. అదే కోపంతో ఒకరోజు ఎవరికీ తెలియకుండా దశరథ్ ను నిజాంపేట శివారులోని అడవుల్లోకి తీసుకెళ్లిన గోపాల్ అతడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తగులబెట్టాడు.
అయితే నాలుగు రోజులుగా భర్త దశరథ్ కనిపించకుండా పోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటపడింది. నిందితుడు గోపాల్ తానే స్వయంగా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దశరథ్ మృతదేహం కోసం భార్య, అతని కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. మృతుడు దశరథ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: Spirit Casting Call: ఇదెక్కడి క్రేజ్.. ప్రభాస్ తో నటించేందుకు మంచు విష్ణు అప్లికేషన్