Saidabad: అకౌంటెంట్‌పై యాసిడ్ దాడి.. నిందితులు ఆలయ అర్చకులే!

సైదాబాద్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నర్సింగ్ రావుపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆలయ అర్చకుడే ఇలా యాసిడ్ దాడి చేశాడు. పూజా కార్యక్రమాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలోనే యాసిడ్ దాడిచేసినట్లు విచారణలో తేలింది.

New Update
Saidabad

Saidabad Photograph: (Saidabad)

హోలీ పండగ సమయంలో సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న నర్సింగ్ రావుపై యాసిడ్ ఎటాక్ జరిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆలయం లోపలికి వచ్చి హ్యాపీ హోలీ అంటూ అతని తలపై యాసిడ్ పోసి పారిపోయాడు. వెంటనే నర్సింగ్ రావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో నర్సింగ్ రావు చికిత్స తీసుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!

ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!

పోలీసులు దర్యాప్తు చేపట్టగా..

నర్సింగ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఆలయ అర్చకుడే అకౌంటెంట్‌పై యాసిడ్ పోసినట్లు పోలీసులు గుర్తించారు. పూజా కార్యక్రమాల విషయంలో అర్చకుడు రాజశేఖర్‌శర్మకు, నర్సింగరావు మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అర్చకుడు ఇలా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. 

ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు