నడి రోడ్డు మీదే యువతి కిడ్నాప్.. ఈడ్చుకెళ్తూ కుటుంబ సభ్యులే..

కులాంతర వివాహం చేసుకుందని ఓ యువతిని కుటుంబ సభ్యులే నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లి కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి.. యువతిని కాపాడి, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

author-image
By Kusuma
New Update
Rajastan

సినిమాలో ఈడ్చుకెళ్లి నడి రోడ్డు మీద కిడ్నాప్ చేసిన ఘటన రియల్ లైఫ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఓ యువతిని సొంత కుటుంబ సభ్యులే నడిరోడ్డుపై కిడ్నాప్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందున ఆమెను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు.

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

ఆటోలో కూర్చున్న యువతిని ఈడ్చుకెళ్లి..

ఆటోలో కూర్చున్న ఆ యువతని నడిరోడ్డుపై కొట్టి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఆ యువతిని రక్షించారు. 

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మధ్యప్రదేశ్‌ నారాయణగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌తోపాటు వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు అంతరి మాతాజీ దర్శానికి వెళ్తున్నారు.

New Update
Madhya Pradesh 123

మధ్యప్రదేశ్‌ నారాయణగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌తోపాటు మరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో నలుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఉజ్జయిని జిల్లా ఉన్హేల్‌కు చెందిన అంతరి మాతాజీ దర్శానికి వ్యాన్‌లో బయలుదేరారు. మధ్యాహ్నం వాహనం బుధ తక్రావత్ ఫాంటా వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపు తప్పి రక్షణ గోడలేని బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను రక్షించేందుకు బావిలోకి దిగిన మరో యువకుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో బైకర్‌ సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Also read: KCR: పోలీసులకు KCR మాస్ వార్నింగ్.. ఈరోజు డైరీలో రాసిపెట్టుకోవాలి

నీముచ్‌ జిల్లా మానస ప్రాంతంలోని అంతరి మాత ఆలయాన్ని దర్శించేందుకు ఉజ్జయిని జిల్లాలోని ఉన్హెల్‌ నుంచి పది మంది వ్యాన్‌లో బయలుదేరినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల బాలికతో సహా నలుగురుని కాపాడి మాండ్‌సౌర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్‌ అదితి గార్గ్‌, ఎస్పీ అభిషేక్‌ ఆనంద్‌, ఇతర పోలీసుల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతోనే అదుపు తప్పి రోడ్డున పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లిందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ప్రమాదం సమయంలో వ్యాన్‌లో ఇద్దరు పిల్లలు సహా 13 మంది వరకు ఉన్నట్లుగా సమాచారం ఉందన్నారు.

(road-accident | Madhya Pradesh | bike | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment