/rtv/media/media_files/2025/03/28/oMTauCHnsEeNtojvLver.jpg)
Rajasthan Udaipur High-profile call girls racket case
Call Girls Case: రాజస్థాన్‌లో(Rajasthan) ఒక హై ప్రొఫైల్ కాల్ గర్ల్ రాకెట్ గుట్టు రట్టైంది. ఉదయపూర్ పోలీసులు(Udaipur Police) హై ప్రొఫైల్ కాల్ గర్ల్ కుంభకోణాన్ని ఛేదించి మహిళలు, విటుడిని అరెస్టు చేశారు. ఈ రాకెట్ ఇతర నగరాల నుంచి అమ్మాయిలను పిలిపించి ఈ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్‌ను సినిమాటిక్ స్టైల్లో నిర్వహించగా.. ఒక కానిస్టేబుల్ కస్టమర్‌గా నటించి లోపలు జరుగుతున్న గలీజ్ దందాను బయటపెట్టడం సంచలనం రేపుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
డమ్మీ కస్టమర్ గా వెళ్లి..
ఈ మేరకు ఉదయపూర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఒక కానిస్టేబుల్ ద్వారా ఈ ఆపరేషన్ చేపట్టారు. కాల్ గర్ల్స్ ఉన్న విల్లాకు కస్టమర్‌గా కానిస్టేబుల్ ను పంపించారు. అతను లోపలికి చేరుకోగానే బ్రోకర్ ఓం ప్రకాష్ జైన్‌ను కలిశాడు. బ్రోకర్ అతన్ని అమ్మాయిలకు పరిచయం చేసి, ఒకరిని ఎంచుకోమని అడిగాడు. ఒప్పందం కుదిరిన వెంటనే, డమ్మీ కస్టమర్ (పోలీస్) ను ఆ అమ్మాయి ఉన్న గదికి పంపారు. అవకాశాన్ని చూసి ఆ కానిస్టేబుల్ తన బృందానికి సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత మొత్తం పోలీసు బృందం విల్లాపై దాడి చేసి 11 మంది అమ్మాయిలను, ఒక విటుడు, నిర్వాహకులను పట్టుకుంది. వారి నుంచి కండోమ్స్, ఇతరత్రా టాయ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read: BIG BREAKING: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
ఇక అమ్మాయిలను విచారించగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఆగ్రా నగరాల నుంచి తమను పిలిచి, బలవంతంగా ఈ వ్యాపారంలోకి నెట్టారని చెప్పారు. ఈ మొత్తం చర్యకు సంబంధించి బ్రోకర్ ఓం ప్రకాష్ జైన్‌పై ఇప్పటికే అక్రమ వ్యభిచారానికి సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ రాకెట్ ఒక్క ఉదయపూర్ కే పరిమితం కాదని, దీని నెట్‌వర్క్ ఇతర నగరాలకు కూడా విస్తరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్ సూత్రధారిని, నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Microplastics: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!
rajastan | sex worker | telugu-news | today telugu news